దినేష్ కార్తీక్.. టీమిండియా క్రికెట్ హిస్టరీలో ఈ పేరు ఒక సంచలనం అని చెప్పొచ్చు. టీమిండియా ఆడిన తొలి టీ20 మ్యాచ్‌లో టీ20ల్లో అరంగేట్రం చేసిన దినేష్ కార్తీక్.. 16 ఏళ్ల తర్వాత మళ్లీ సౌత్ ఆఫ్రికాతో జరిగే టీ20 సిరీస్‌లో స్థానం సంపాదించాడు. 37 ఏళ్ల వయసులోనూ టీమిండియాకు బెస్ట్ ఫినిషర్ గా దినేష్ కార్తీక్ సేవలందిస్తున్నాడు. ప్రస్తుతం జరుగుతున్న టీ20 సిరీస్ లోనూ తనదైనశైలిలో దినేష్ కార్తీక్ టీమిండియాకి సేవలందిస్తున్నాడు. 2022 ఆస్ట్రేలియాలో జరగనున్న ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ లో చోటు దక్కించుకోవడమే లక్ష్యంగా దినేష్ కార్తీక్ కఠోర శ్రమ చేస్తున్నాడు. అయితే అలాంటి దినేష్ కార్తీక్ ను టీ20 వరల్డ్ కప్ లోకి తీసుకోవద్దు అంటూ టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ‘ధినేష్ కార్తీక్ మ్యాచ్ చివర్లో బ్యాటింగ్ కి వచ్చి రెండు మూడు ఓవర్లు మాత్రమే ఆడతాను అంటే కుదరదు. అతనిలాంటి ఫినిషర్ కోసం టీమిండియా వెతుకున్న మాట వాస్తవమే.. కానీ, ఆ స్థానంలో ఆల్ రౌండర్ ని ఎంపిక చేస్తే ఎంతో బావుంటుంది. కేవలం రెండు, మూడు ఓవర్లకు పరిమితమయ్యే పనైతే.. టీ20 ప్రపంచకప్ కు దినేష్ కార్తీక్ ను ఎంపిక చేయడం వృథా. తానైతే.. పంత్, హార్దిక్ పాండ్యా, దీపక్ హుడా, జడేజా లాంటి ఆటగాళ్లనే ప్రిఫర్ చేస్తాను. On the rise #INDvSA pic.twitter.com/9tk3njVGks — DK (@DineshKarthik) June 14, 2022 ‘అంతేకాకుండా కోహ్లీ, సూర్యకుమార్, కేఎల్ రాహుల్, రోహిత్ శర్మలాంటి ప్లేయర్లు ఉన్న జట్టులో దినేష్ కార్తీక్ కు కూడా స్థానం లభిస్తుంది అని అనుకోవట్లేదు. ఒకవేళ వరల్డ్ కప్ ఫైనల్ 11లో డీకేకి స్థానం కల్పించకపోతే.. అసలు ఆస్ట్రేలియా తీసుకెళ్లడంలో ఎలాంటి ఉపయోగం లేదు. దినేష్ కార్తీక్ మెరుపు ఇన్నింగ్స్ మీద మాత్రమే కాకుండా ఎక్కువ సమయంలో క్రీజులో ఉండటంపై కూడా దృష్టి సారించాలి.’ అంటూ గౌతమ్ గంభీర్ దినేష్ కార్తీక్ ప్రదర్శన, భవిష్యత్తుపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. Gautam Gambhir picks his top 7 pic.twitter.com/oCDtTQCI7L — RVCJ Media (@RVCJ_FB) June 13, 2022 ఇంక దినేష్ కార్తీక్ ప్రదర్శన విషయానికి వస్తే.. ఐపీఎల్ 2022 సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున అద్భుతమైన ప్రదర్శన చేశాడు. ఆర్సీబీ ప్లే ఆఫ్స్ దశ వరకు చేరుకోవడంలో డీకే పాత్ర ఎంతైనా ఉంది. ఈ ఐపీఎల్ సీజన్లో జట్టుకు అద్భుతమైన ఫినిషర్ గా మారాడు. మొత్తం 16 మ్యాచుల్లో 183.3 స్ట్రైక్ రేట్ తో 330 పరుగులు చేశాడు. ప్రస్తుతం దినేష్ కార్తీక్ ఆస్ట్రేలియాలో జరగనున్న ఐసీసీ మెన్స్ టీ20 ప్రపంచకప్ తుది జట్టులో స్థానం కోసం కఠోర శ్రమ చేస్తున్నాడు. గౌతమ్ గంభీర్ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇదీ చదవండి: ఇండియా టీ20 మ్యాచ్ మధ్యలో భీమ్లానాయక్ సాంగ్.. దద్దరిల్లిన స్టేడియం! ఇదీ చదవండి: టెస్టుని టీ20లా ఆడిన జానీ బెయిర్‌స్టో.. సిరీస్ కైవసం చేసుకున్న ఇంగ్లాండ్!