దక్షిణాఫ్రికా-భారత్ మధ్య జోహన్నెస్‌బర్గ్ వేదిగా జరుగుతున్న రెండో టెస్టులో ఇరుజట్ల ఆటగాళ్ల మధ్య మాటల యుద్ధాలు చోటుచేసుకుంటున్నాయి. ఇంతకు ముందు టీమిండియా తాత్కాలిక కెప్టెన్ కేఎల్ రాహుల్, సౌత్ ఆఫ్రికా కెప్టెన్ ఎల్గర్ మధ్య మాటామాట జరిగిన విషయం తెలిసిందే. తాజాగా ఆట మూడో రోజు టీమిండియా వైస్ కెప్టెన్, సీనియర్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా మధ్య గొడవ జరిగింది. టీమిండియా రెండో ఇన్నింగ్స్ 54వ ఓవర్‌లో దక్షిణాఫ్రికా యువ పేసర్ మార్కో జాన్సన్ కవ్వింపులకు దిగాడు. ఆ సమయంలో బుమ్రా బ్యాటింగ్ చేస్తున్నాడు.
పదే పదే షార్ట్ బంతులు వేస్తూ.. బుమ్రాను సవాలు చేస్తున్నాడు. అదే ఓవర్‌లో ఒక బంతి బుమ్రా భుజానికి బలంగా తాకింది. దీంతో జాన్సన్ బుమ్రాను వెక్కిరిస్తూ.. నోరు పారేసుకున్నాడు. బుమ్రా సినిమా స్టైల్లో భుజాన్ని దులుపుతూ.. అదిరిపోయే కౌంటర్ ఇచ్చాడు. బుమ్రా కౌంటర్‌కు మండిపోయిన జాన్సన్ తర్వాతి బంతిని కూడా షార్ట్ పిచ్‌గా వేశాడు. దాన్ని ఆడబోయిన బుమ్రా విఫలం అయ్యాడు. దీంతో జాన్సన్ మళ్లీ నోరుపారేసుకున్నాడు. ఈ సారి బుమ్రా కోపం కట్టలుతెంచుకుంది. జాన్సన్‌పైకి దూసుకెళ్లాడు. మాటకు మాట బదులిస్తూ.. ఇద్దరు కొట్టుకునేంత పని చేశారు. సమయానికి అంపైర్ కలుగజేసుకుని, ఇద్దరికి నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు.
అంపైర్ మధ్యలో రాకుంటే.. బుమ్రా ఆవేశంతో జాన్సన్‌పై చేయి చేసుకునేంత కోపంతో కనిపించాడు. కాగా గొడవ తర్వాత జాన్సన్ గంటకి 143కిమీ వేగంతో బౌన్సర్ విసరడం గమనార్హం. అయినప్పటికీ.. బుమ్రా వెనక్కి తగ్గకుండా బంతిని హిట్టింగ్ చేసేందుకే ప్రయత్నించాడు. అయితే.. తర్వాత ఓవర్‌లో రబాడా బౌలింగ్ సిక్స్ బాదిన బుమ్రా.. అనంతరం ఎంగిడి బౌలింగ్‌లో జాన్సన్‌కి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఈ గొడవపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: కోహ్లీ, ద్రావిడ్, గంభీర్, పుజారా చేయలేనిది.. బుమ్రా చేశాడు! వీడియో వైరల్
— Addicric (@addicric) January 5, 2022