సుదీర్ఘ విరామం తర్వాత ఐపీఎల్ లో చెలరేగి, టీమ్ ఇండియాలో చోటు దక్కించుకున్న దినేశ్ కార్తీక్.. తన బ్యాటింగ్ తో అదరగొడుతున్నాడు. చాలా కాలం తర్వాత టీమీండియాలోకి వచ్చి.. సరికొత్త కార్తీక్ ను ఫ్యాన్స్ కి పరిచయం చేస్తున్నాడు. ఇటీవల సౌతాప్రికాతో జరిగిన ఐదు మ్యాచ్ ల టీ-20 సిరీస్ లో అద్భుతంగా రాణించి, సత్తా చాటాడు. ఈ దూకుడైన ఆటతీరుతో తాజాగా విడుదలైన ఐసీసీ T-20 ర్యాంకింగ్స్ లో దుమ్ములేపాడు. ఏకంగా 108 స్థానాలు ఎగబాకి 87 స్థానంలో నిలిచాడు. బుధవారం ఐసీసీ ప్రకటించిన టీ-20 ర్యాంకింగ్స్ దినేశ్ కార్తిక్ 87 వస్థానంలో నిలిచాడు. సౌతాఫ్రికాతో జరిగిన టి20 సిరీస్‌లో ఫినిషర్‌గా తనదైన పాత్ర పోషించిన డీకే..టీ-20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్ ఒకేసారి 108 స్థానాలు ఎగబాకి 392 పాయింట్లతో 87వ స్థానం సాధించాడు. సౌతాఫ్రికాతో జరిగిన నాలుగో టి20 మ్యాచ్‌లో 27 బంతుల్లోనే 55 పరుగులతో జట్టు విజయంలో కీలకపాత్ర పోషించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచిన విషయం తెలిసిందే. మరోకపక్క టాప్-10లో ఉన్న ఏకైక టీమిండియా బ్యాటర్ ఇషాన్ కిషన్ గతవారం ఏడో స్థానంలో ఉండగా.. ఒకస్థానం మెరుగుపరుచుకొని 703 పాయింట్లతో డెవన్ కాన్వే(కివీస్)తో సంయుక్తంగా 6వ స్థానంలో నిలిచాడు. సౌతాఫ్రికాతో టి20 సిరీస్‌లో ఇషాన్ కిషన్ నాలుగు మ్యాచ్‌ల్లో రెండు అర్థసెంచరీలతో 206 పరుగులు చేశాడు. ఇక ఐసీసీ ప్రకటించిన టీ-20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్ తొలి ఐదు స్థానాల్లో ఎలాంటి మార్పులు లేవు. బాబర్ ఆజం తొలి స్థానంలో ఉండగా.. మహ్మద్ రిజ్వాన్, ఐడెన్ మార్క్రమ్ లు రెండు, మూడో స్థానంలో ఉన్నారు. బౌలర్ల జాబితాలో చహల్ మూడు స్థానాలు ఎగబాకి 23వ స్థానంలో నిలవగా.. ఆసీస్ పేసర్ జోష్ హాజిల్‌వుడ్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. మరి.. సుదీర్ఘ విరామం తర్వాత వచ్చి దినేశ్ కార్తిక్ ఏకంగా 108 స్థానాలు ఎగబాకి టాప్-100లో చోటు సంపాంధించడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. Players are jostling for spots in the latest @MRFWorldwide T20I men's player rankings More https://t.co/ksceq8SPGY pic.twitter.com/1pFif8wMNH — ICC (@ICC) June 22, 2022