కరేబియన్ వీరుడు, సిక్సర్ల కింగ్, యునివర్సల్ బాస్ క్రిస్ గేల్ ఎలాంటి విధ్వంసకర ఆటగాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తనదైన రోజు ఎలాంటి బౌలర్‌నైనా చిత్తుచిత్తుగా కొట్టే క్రిస్ గేల్.. బౌలింగ్‌తోనూ మ్యాజిక్ చేయగలడు. పార్ట్‌టైమ్ స్పిన్నర్‌గా వెస్టిండీస్‌తో పాటు తనాడిన చాలా ప్రాంచైజ్ జట్లకు గేల్ బ్యాట్, బాల్‌తోనూ సేవలందించాడు. తాజాగా తన బౌలింగ్ గురించి మాట్లాడుతూ.. తానో గొప్ప ఆఫ్ స్పిన్నర్‌నని, ముత్తయ్య మురళీథరన్ కూడా తనకు పోటీ రాలేదంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. వెస్టిండీస్ మిస్టరీ స్పిన్నర్ సునీల్ నరైన్ కూడా తనను అందుకోలేడంటూ పేర్కొన్నాడు. చాలా కాలంగా క్రికెట్‌కు దూరంగా ఉన్న క్రిస్ గేల్ సిక్ట్సీ టోర్నమెంట్లో బరిలోకి దిగనున్నాడు. ఈ సందర్భంగా గేల్ మాట్లాడుతూ..‘చాలా రోజుల తర్వాత మళ్లీ ఫీల్డ్‌లోకి దిగుతుండటం ఎంతో సంతోషంగా ఉంది. మళ్లీ నేనో కుర్రాడిననే భావన నాకు కలుగుతోంది. ఇదే నా డెబ్యూ మ్యాచ్‌లా భావిస్తున్నా.. అలాగే ప్రపంచ క్రికెట్లో నేనో గొప్ప ఆఫ్ స్పిన్నర్‌ని. ముత్తయ్య మురళీథరన్ కూడా నాకు సరి కాడు. అలాగే నాకు అత్యుత్తమ ఎకనామీ ఉంది. సునీల్ నరైన్ కూడా దాన్ని అందుకోలేడు. నా బౌలింగ్ ఎంతో సహజంగా, కచ్చితంగా ఉంటుంది.’ అని అన్నాడు. చాలా కాలం తర్వాత మళ్లీ క్రికెట్ ఆడనున్న గేల్ బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌పై కూడా పూర్తి దృష్టి పెట్టినట్లు తెలుస్తుంది. వెస్టిండీస్‌లో కొత్తగా ‘సిక్ట్సీ’ లీగ్‌ను నిర్వహించనున్నారు. 60 బంతుల ఇన్నింగ్స్ ఉంటుంది. ఇంగ్లండ్‌లో జరుగుతున్న ది హండ్రెడ్ లీగ్‌కు పోలి ఉంటుంది ఈ సిక్ట్సీ లీగ్. 2021 టీ20 వరల్డ్ కప్ తర్వాత గేల్ క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు. అలాగని క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించలేదు. ఐపీఎల్ 2022లో కూడా గేల్ ఆడలేదు. అతనికి ఐపీఎల్లో డిమాండ్ ఉన్నా కూడా గేల్ ఆసక్తి చూపలేదు. మరి సిక్ట్సీ లీగ్‌తో గేల్ మళ్లీ ఫీల్డ్‌లోకి దిగడం, ముత్తయ్య మురళీథరన్ కంటే తానే గొప్ప స్పిన్నర్ అని ప్రకటించడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి. ఇది కూడా చదవండి: గంగూలీ, సెహ్వాగ్, భజ్జీ లాంటి స్టార్లు ఆడే లెజెండ్స్ లీగ్ క్రికెట్ షెడ్యూల్ విడుదల My bowling is natural. I'm the greatest off-spinner of all time .Murali (Muttiah Muralitharan) won't contest that for sure:Chris Gayle#cricketnews #crickettwitter #chrisgayle — CricInformer(Cricket News & Fantasy Tips) (@CricInformer) August 24, 2022