జీవితం రోటిన్ గా సాగితే ఏం మజా ఉంటుంది.. అప్పుడప్పుడు దానికి కొంచెం మసాలా యాడ్ చేస్తేనేగా తెలిసేది.. అందులో ఉన్న కిక్. ఇదే విషయాన్ని ఫాలో అయ్యారు ఆస్ట్రేలియా బిగ్ బాగ్ ఆటగాళ్లు. తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో ప్లేయర్ కి బదులు అసిస్టెంట్ కోచ్ ని ఆటలోకి దింపింది సిడ్నీ సిక్సర్స్. ఇక ఈ మ్యాచ్ లో మరో విషయం ఏంటంటే మ్యాచ్ చివరి బంతికి వింతగా ప్రవర్తించి ప్రపంచం అంతా తమ గురించి చర్చించుకునేలా చేశారు.
వివరాల్లోకి వెళ్తే.. క్రికెట్లో అప్పుడప్పుడు భిన్నమైన సంఘటనలు చోటుచేసుకోవడం మనకు తెలిసిన విషయమే. ఇలాంటి ఘటనే తాజాగా చోటు చేసుకొంది. ఆస్ట్రేలియాలో నిర్వహించే బిగ్ బాష్ లీగ్ చివరి దశకు చేరుకుంది. ప్లేఆఫ్స్ లో బుధవారం అడిలైడ్ స్ట్రైకర్స్, సిడ్నీ సిక్సర్స్ జట్లు ఫైనల్ ప్లేస్ కోసం పోటీపడ్డాయి. ఈ సందర్భంగా మ్యాచ్ చివరి బంతికి ముందు సిడ్నీ సిక్సర్స్ జట్టు ప్రవర్తించిన తీరు చర్చనీయాంశంగా మారింది.
బిగ్ బాష్ లీగ్ ఫైనల్ చేరాలంటే ఈ మ్యాచ్ ఆఖరి బంతికి సిడ్నీ జట్టు రెండు పరుగులు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. అప్పటికి హేడెన్ కేర్ (94), జోర్డాన్ సిల్క్ (1) పరుగులతో క్రీజులో ఉన్నారు. అయితే, హేడెన్ చివరి బంతిని ఎదుర్కోవాల్సి ఉండగా నాన్ స్ట్రైక్ ఎండ్ లో ఉన్న జోర్డాన్ సిల్క్ ను ఆ జట్టు రిటైర్డ్ హార్ట్ గా వెనక్కి పిలిచింది. అతడికి బదులు అసిస్టెంట్ కోచ్ జే లెంటన్ ను క్రీజులోకి పంపింది. జట్టులో పలువురు ఆటగాళ్లకు కోవిడ్ సోకడంతో అక్కడి నియమాల ప్రకారం లెంటన్ ఆడించింది సిడ్నీ జట్టు. చివరికి హేడెన్ కేర్ బౌండరీ సాధించడంతో సిడ్నీ జట్టు విజయం సాధించింది.
ఆఖరి బంతికి సిడ్నీ సిక్సర్స్ జట్టు ఇలా బ్యాట్స్ మెన్ ను మార్చడం ఇప్పుడు చర్చనీయాశంగా మారింది. తాము క్రికెట్ నిబంధనల మేరకే ప్రవర్తించామని సిడ్నీ జట్టు చెబుతుండగా.. అది క్రీడాస్ఫూర్తికి విరుద్ధమని పలువురు క్రికెట్ అభిమానులు వాదిస్తున్నారు. ఇక శుక్రవారం సిడ్నీ సిక్సర్స్.. పెర్త్ స్కార్చర్స్ తో ఫైనల్లో తలపడనుంది. ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.
The @sixersBBL decision to retire Jordan Silk hurt on the final ball caught us all off-guard 🤔 #BBL11 pic.twitter.com/GbU2qfBgBi
— KFC Big Bash League (@BBL) January 26, 2022