Ben Stokes: 2019 వన్డే ప్రపంచకప్ ఫైనల్లో ఇంగ్లాండ్ ఎలా విజయం సాధించిందో అందరికి గుర్తుండే ఉంటుంది. ఆ మ్యాచ్ లో ఓవర్ త్రో కారణంగా ఇంగ్లాండ్ విజేతగా నిలిచింది. ఇంగ్లండ్ గెలవాలంటే మూడు బంతుల్లో 9 పరుగులు కావాల్సిన దశలో చివరి ఓవర్ బౌల్డ్ వేశాడు. ఆ ఓవర్లో మూడో బంతిని స్టోక్స్ మిడాఫ్ దిశగా ఆడాడు. బంతిని అందుకున్న మార్టిన్ గప్టిల్ రనౌట్‌కు అవకాశం ఉండడంతో ఓవర్ త్రో వేశాడు. రెండో పరుగు కోసం వస్తున్న స్టోక్స్ బంతిని గమనించి క్రీజులోకి డైవ్ చేశాడు. ఈ క్రమంలో బ్యాట్‌కు తాకిన బంతి మిడ్ వికెట్ మీదుగా బౌండరీ వెళ్లింది. ఆ సమయంలో స్టోక్స్ తన తప్పు లేదు అంటూ.. చేతులు పైకెత్తి చూపించడం అందరికి గుర్తుండే ఉంటుంది.
అప్పట్లో ఈ ఓవర్ త్రో వివాదం పెద్ద సంచలనంగా మారింది. అయితే.., తాజాగా ఇదే ఘటన మళ్ళీ రిపీట్ అయ్యింది. అది కూడా ఇంగ్లాండ్, న్యూజిలాండ్ జట్ల మధ్య కావడం, ఇప్పుడు కూడా స్టోక్స్ క్రీజ్ ఉండటం విశేషం. ఇంగ్లండ్, న్యూజిలాండ్ మధ్య తొలి టెస్టు హోరాహారీగా సాగుతోంది. 277 పరుగుల విజయ లక్ష్యంతో సెకండ్ ఇన్నింగ్స్ ఆరంభించిన ఇంగ్లాండ్ మూడో రోజు ఆట ముగిసే సమయానికి 5 వికెట్లు కోల్పోయి 216 పరుగులు చేసింది. అయితే.. ఇన్నింగ్స్ 43వ ఓవర్లో బోల్ట్ బౌలింగ్‌లో జో రూట్ మిడ్ వికెట్ దిశగా షాట్ ఆడాడు.
అయితే.. సింగిల్ కోసం ప్రయత్నం చేసిన స్టోక్స్, అది సాధ్యం కాక వెనక్కి పరిగెత్తాడు. అయితే.. ఈ క్రమంలో రనౌట్ చేద్దామని భావించిన ఫీల్డర్ ఓవర్ త్రో వేయడం.. అచ్చం అప్పటి తరహాలోనే స్టోక్స్ బ్యాట్‌ను తాకి.. బాల్ మిడ్ వికెట్ మీదుగా బౌండరీ లైన్ కి దగ్గరగా వెళ్ళింది. అయితే.., అప్పటికే క్రీజ్ లోకి వచ్చేసిన స్టోక్స్.. బ్యాట్‌కు తాకి బంతి అలా వెళ్లిందని.. తన తప్పేం లేదని సిగ్నల్ ఇచ్చాడు. ఇది చూసిన రూట్.. నా తప్పు కూడా ఏం లేదు అన్నట్లుగా స్టోక్స్‌ను అనుకరించడంతో మైదానంలో ఒక్కసారిగా నవ్వులు పూశాయి. ఈ ఘటనతో అందరికి 2019 వరల్డ్‌కప్ ఫైనల్ ఓవర్ త్రో వివాదం గుర్తుకి వచ్చింది. మరి.. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : T20 Qualifier: ఆ జట్టు పేరిట అత్యంత చెత్త రికార్డు! 8 పరుగులకే ఆలౌట్!
If you know, you know 😅
🏴 #ENGvNZ 🇳🇿 pic.twitter.com/ZyIcvwkk8B
— England Cricket (@englandcricket) June 4, 2022