Steffan Nero: ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ కి ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎన్నో ఏళ్లుగా వన్డేలు మొదలుకొని టెస్టులు, టీ20లలో రికార్డుల మీద రికార్డులు నమోదు అవుతూనే ఉన్నాయి. అయితే.. టీ20 మ్యాచులు వచ్చాక డబుల్, ట్రిపుల్ సెంచరీలు మరిచిపోయారు క్రికెట్ ఫ్యాన్స్. టెస్ట్ మ్యాచులలో డబుల్ ట్రిఫుల్ సెంచరీలు నమోదు చేసినా.. వన్డేలో క్రియేట్ చేయడం అనేది మామూలు విషయం కాదు. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో ట్రిపుల్ సెంచరీ అనేది గొప్ప విషయంగానే చెప్పాలి. తాజాగా ఆస్ట్రేలియా అంధ క్రికెటర్ స్టెఫన్ నీరో ప్రపంచ రికార్డు సెట్ చేశాడు. న్యూజిలాండ్ తో జరుగుతున్న వన్డే సిరీస్ లోని రెండో మ్యాచ్ లో నీరో.. తాను ఆడిన 140 బంతుల్లో 309 పరుగులు చేసి ఆశ్చర్యపరిచాడు. దాదాపు మూడు గంటల పాటు ఆడిన నీరో బ్యాటింగ్ లో ఏకంగా 49 బౌండరీలు, ఒక సిక్సర్ కూడా ఉంది. అంటే ఫోర్లు, సిక్సర్ లతోనే నీరో 202 పరుగులు రాబట్టడం విశేషం. ఇదిలా ఉండగా 309* రన్స్ తో.. గతంలో పాకిస్తాన్ బ్యాటర్ మసూద్ జాన్ పేరిట ఉన్న అత్యధిక స్కోరు(262 పరుగులు) రికార్డును బద్దలు కొట్టాడు నీరో. 1998లో అంధుల క్రికెట్ ప్రపంచ కప్ లో మసూద్ 262 రన్స్ చేశాడు. అప్పటినుండి మసూద్ పేరిటే ఉంది ఆ రికార్డు. ఇప్పుడు నీరో ఆ రికార్డు బ్రేక్ చేసి.. ఎవరూ అందుకోలేని సరికొత్త రికార్డు సెట్ చేయడం గొప్ప విషయం. కాగా ఆసీస్-కివీస్ మధ్య జరిగిన తొలి వన్డేలో నీరో రెచ్చిపోవడంతో 40 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి ఏకంగా 542 పరుగులు సాధించారు. ఇక భారీలక్ష్యాన్ని ఛేదించే క్రమంలో కివీస్.. 272 పరుగుల వద్దే ఆలౌట్ అయ్యింది. ఫలితంగా ఆసీస్.. 270 పరుగుల భారీ తేడాతో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. ఐదు టీ20లు, మూడు వన్డేలు ఆడేందుకు గాను కివీస్ అంధుల జట్టు ఆసీస్ లో పర్యటిస్తోంది. ఈ పర్యటనలో భాగంగా చివరి వన్డే శుక్రవారం జరుగనున్నట్లు సమాచారం. మరి నీరో నెలకొల్పిన కొత్త వరల్డ్ రికార్డుపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి. A TRIPLE century! Steffan Nero finishes 309* (140) in the Australian Blind Cricket Team's first ODI against New Zealand That's his third consecutive century at the #ICIS22 after scores of 113 (46) and 101* (47) earlier this week https://t.co/MDTiUnAC1S | #ASportForAll pic.twitter.com/cqv9vBEPW3 — Cricket Australia (@CricketAus) June 14, 2022 Australia has a new world record holder Australian Blind Cricket Team opener Steffan Nero scored 309* (140) in today's first ODI against New Zealand, breaking the previous record of 262* set by Pakistan's Masood Jan in 1998.#ICIS22 | #ASportForAll pic.twitter.com/L9yrYqkquF — Cricket Australia (@CricketAus) June 14, 2022