'కళ్లు కనపడని వాడిని అంపైర్లు చేస్తే ఎలా ఉంటదో.. అలా ఉంది ఆసియా కప్ లో అంపైరింగ్. టోర్నీ తొలి మ్యాచ్ రెండో ఓవర్ లోనే అలాంటి సంఘటన చోటు చేసుకుంది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన శ్రీలంక మొదటి ఓవర్లలోనే రెండు వికెట్లు కోల్పోయింది. ఇక, రెండో ఓవర్ లో ప్రతుమ్ నిస్సంక క్యాచ్ అవుట్ గా వెనుదిరిగాడు. ఇక్కడే అసలు ట్విస్ట్ చోటు చేసుకుంది. క్యాచ్ అవుట్ గా అంపైర్ ప్రకటించాక.. నిస్సంక వెంటనే 'డీఆర్ఎస్' కోరాడు. అందులో ఎలాంటి ఎడ్జ్ తీసుకోలేదని స్పష్టంగా కనిపించింది. అయినప్పటికీ.. ఆన్ ఫీల్డ్ అంపైర్ అవుట్ గా ప్రకటించాడు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఆసియాకప్-2022లో భాగంగా తొలి మ్యాచ్లో దుబాయ్ వేదికగా ఆఫ్గనిస్తాన్, శ్రీలంక జట్లు తలపడునున్నాయి. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఆఫ్గానిస్తాన్ తొలుత బౌలింగ్ ఎంచుకోగా.. బ్యాటింగ్కు దిగిన శ్రీలంకకు ఫజల్హక్ ఫరూఖీ ఆదిలోనే దెబ్బకొట్టాడు. తొలి ఓవర్లో రెండు వికెట్లు పడగొట్టి ఆఫ్గానిస్తాన్ అద్భుతమైన శుభాంభం అందించాడు. ఐదో బంతికి కుశాల్ మెండీస్, అఖరి బంతికి అసలంకను ఎల్బీ రూపంలో ఫరూఖీ పెవిలయన్కు పంపాడు. తొలి ఓవర్ ముగిసేసరికి శ్రీలంక స్కోర్: 3/2. అనంతరం రెండో ఓవర్ వేయడానికి బాల్ అందుకున్న నవీన్ ఉల్ హక్.. ఓవర్ ఆఖరి బంతికి ప్రతుమ్ నిస్సంకను క్యాచ్ అవుట్ గా పెవిలియన్ పంపించాడు. ప్రస్తతానికి శ్రీలంక స్కోర్ 7 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 49 పరుగులు చేసింది. View this post on Instagram A post shared by Vardhan Reddy (@vardhan.reddy.3139241) Horrific decision from the 3rd Umpire#Afghanistan #SriLanka #AsiaCup #AFGvsSL #Sky11 pic.twitter.com/DKiv27pevM — Sky11 (@sky11official) August 27, 2022 Yeh Kaisi Umpiring Hai Bhai? Not Out ko Bhi Out Dy Rahy It's Disgusting #SLvsAFG #AFGvsSL#AsiaCup2022 pic.twitter.com/X44Ra7vqWg — Social Speaker (@Nineteen_47) August 27, 2022