టీమిండియా మాజీ క్రికెటర్, లెజెండ్ సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ మహిళా క్రికెటర్‌తో క్లోజ్‌గా ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇంగ్లాండ్ మహిళా క్రికెటర్ డేనియల్ వ్యాట్‌తో అతను డిన్నర్ చేస్తున్న ఫొటోలు దర్శనమివ్వడంతో అభిమానులు అర్జున్ ఆమె డేటింగ్ చేస్తున్నాడా? అంటూ కామెంట్ చేస్తున్నారు. అర్జున్ టెండూల్కర్ ప్రస్తుతం ఇంగ్లాండులో ఉన్నాడు. అతనితో డిన్నర్ చేసిన ఫొటోలను డేనియల్ వ్యాట్ తన అధికారిక సోషల్ మీడియా అకౌంట్లో కూడా పోస్టు చేస్తూ ‘నండోస్ రెస్టారెంట్లో నా లిటిల్ మేట్‌ను చూస్తున్నందుకు సంతోషంగా ఉంది” అంటూ వ్యాట్ పేర్కొంది. కాగా గతంలో అర్జున్ టెండూల్కర్, డానియెల్ వ్యాట్ కలిసున్న ఫోటోలు సోషల్ మీడియాలో సందడి చేశాయి. అర్జున్ టెండూల్కర్ అమ్మమ్మ పుట్టిల్లు ఇంగ్లాండ్ కావడంతో, తరచుగా ఇక్కడికి వస్తూ ఉంటాడు. అర్జున్ టెండూల్కర్ ఇక్కడి మైదానాల్లో ఇంగ్లీష్ క్రికెటర్లతో కలిసి ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు. మొత్తానికి ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. కాగా అర్జున్ టెండూల్కర్ ముంబై ఇండియన్స్ టీమ్‌లో సభ్యుడిగా రెండు సీజన్ల నుంచి ఉన్నా.. తుది జట్టులో మాత్రం స్థానంలో లభించడం లేదు. మరి అర్జున్, డేనియల్ ఫ్రెండ్షిప్పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి. Good to see my little mate for a Nandos yesterday pic.twitter.com/K9V4bC2OGS — Danielle Wyatt (@Danni_Wyatt) June 28, 2022