క్రికెట్ చరిత్రలో తొలి వన్డే మ్యాచ్ 1971 జనవరి 5న జరిగింది. అప్పటి నుంచి సరిగ్గా 39 సంవత్సరాల 1 నెల, 19 రోజుల తరువాత అంటే 2010 ఫిబ్రవరి 24 న క్రికెట్ చరిత్రలో ఒక అద్భుతం ఆవిష్కృతమైంది. అతవరకు కలలో కూడా ఊహించని ఆ రికార్డును నిజం చేస్తూ.. యువ ఆటగాళ్లకు స్పూర్తిని ఇస్తూ వన్డే చరిత్రలోనే తొలి డబుల్ సెంచరీ నమోదైంది. ఆ అద్భుతాన్ని సృష్టించింది క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ అని ప్రత్యేకంగా చెప్పాలిన పనిలేదు.
క్రికెట్‌లో ఎన్నో గొప్పగొప్ప రికార్డులను బద్దలు కొట్టి, సృష్టించిన సచిన్.. వన్డే క్రికెట్‌కే వన్నెతెచ్చే విధంగా తొలి డబుల్ సెంచరీని సాధించాడు. ఆ తర్వాత సచిన్ స్ఫూర్తితో మరి కొంతమంది ఆటగాళ్లు వన్డేల్లో డబుల్ సెంచరీ బాదారు. కానీ మొదటిది ఎంతైన మధురమే కదా. అలాంటి మధురమైన అనుభూతికి నేటికి 12 ఏళ్లు. సరిగ్గా ఇదే రోజు సచిన్ వన్డేలో తొలి డబుల్ సెంచరీ చేశాడు. అప్పటి మధుర జ్ఞాపకాలను మళ్లీ ఒక సారి గుర్తు చేసుకుందాం..
ఫిబ్రవరి 24, 2010 న భారత్-దక్షిణాఫ్రికా మధ్య వన్డే మ్యాచ్ ప్రారంభం అయింది. అప్పుడు ఎంఎస్ ధోని టీమిండియా కెప్టెన్‌గా ఉన్నాడు. టాస్ గెలిచిన ధోని మొదట బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఓపెనర్‌గా బ్యాటింగ్‌కు దిగిన వీరేందర్ సెహ్వాగ్ 9 పరుగులకే ఔట్ అయ్యాడు. దాంతో భారత్ 25 పరుగులకే తొలి వికెట్‌న్ కోల్పోయింది. కానీ, అటువైపు ఉన్న సచిన్ టెండూల్కర్ ఏమాత్రం తగ్గలేదు. అదిరిపోయే షాట్లతో మ్యాచ్‌ను రక్తికట్టించాడు. 50వ ఓవర్ చివరి బంతి వరకూ ఉన్న సచిన్.. 147 బంతుల్లో 200 పరుగులు చేశాడు. ఇందులో 25 ఫోర్లు, 3 సిక్స్‌లు ఉన్నాయి. దాంతో వన్డే చరిత్రలో సచిన చేసిన 200 పరుగులే మొదటి డబుల్ సెంచరీగా రికార్డులకెక్కింది.
ఇన్నింగ్స్‌లో హైలెట్ ఏంటంటే.. కేవలం ఫోర్లతోనే సచిన్ సెంచరీ పరుగులు చేశాడు. 200 పరుగులు చేసి అంతకు ముందు పాక్ ఆటగాడు సయీద్ అన్వర్ పేరిట ఉన్న అత్యధిక పరుగుల(194) రికార్డ్‌ను బద్దలు కొట్టాడు. సచిన్ తరువాత మరుసటి ఏడాదే వీరేంద్ర సెహ్వాగ్ డబుల్ సెంచరీ రికార్డ్‌ను బీట్ చేశాడు. ఏకంగా 219 పరుగులు చేశాడు. క్రిస్ గేల్, ఫకర్ జమాన్, రోహిత్ శర్మ, మార్టిన్ గప్టిల్, అమిలియా కేర్ వంటి ప్లేయర్లు కూడా వన్డేల్లో డబుల్ సెంచరీ చేశాడు. మరి క్రికెట్ గాడ్ సచిన్ డబుల్ సెంచరీపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
🗓️ #OnThisDay in 2010
The legendary @sachin_rt etched his name in the record books as he became the first batter to score a double ton in ODIs (Men’s). 🔝 👏 👍 🙌
Let’s relive that special knock from the batting maestro 🎥 🔽https://t.co/i9vCBxzhA6 pic.twitter.com/1LRbuYVe8K
— BCCI (@BCCI) February 24, 2022