చాలారోజుల నుంచి వాయిదా మీద వాయిదాలు పడుతూ వచ్చిన సమంత ' శాకుంతలం' ఫైనల్లీ థియేటర్స్ లోకి వచ్చేసింది. మరి సినిమా ఎలా ఉంది? హిట్టు కొట్టారా? లేదా అనేది తెలియాలా అయితే ఈ రివ్యూ చదివేయండి.
తెలుగు వాళ్లకు సినిమా అంటే వినోదం మాత్రమే. జానర్ ఏదైనా సరే సరిగ్గా తీయాలే గానీ ప్రేక్షకులు అక్కున చేర్చుకుంటారు. గతంలో ఉండేవి కానీ.. రీసెంట్ టైమ్స్ లో పురాణ, ఇతిహాస కథలతో సినిమాలు మళ్లీ తీస్తున్నారు. అలా మహాభారతంలోని ఓ ప్రేమకథ ఆధారంగా తీసిన సినిమానే ‘శాకుంతలం’. స్టార్ హీరోయిన్ సమంత లీడ్ రోల్ చేసిన ఈ మూవీపై ఓ మాదిరి అంచనాలే ఉన్నాయి. కానీ చాలా రోజుల నుంచి వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమా.. ఫైనల్ గా థియేటర్స్ లోకి వచ్చేసింది. మరి ఈ మైథలాజికల్ రొమాంటిక్ సినిమా ఎలా ఉంది? ఏంటనేది ఇప్పుడు రివ్యూలో చూద్దాం!
శాకుంత పక్షులు ఓ పసిబిడ్డని తీసుకుని ఓ చోట విడిచి పెడతాయి. అక్కడికి దగ్గరలో కన్వ ముని (సచిన్ ఖేడ్కర్) ఆశ్రమం వుంటుంది. అలా ఆ ముని, ఆ పాపని పెంచి పెద్దచేస్తారు. శకుంతల(సమంత) అని పేరు కూడా పెడతారు. ఓ రోజు పులుల్ని వేటాడుతూ దుష్యంత (దేవ్ మోహన్) రాజు ఆ ఆశ్రమానికి వస్తాడు. అక్కడ శకుంతలని చూసి తొలి చూపులోనే ప్రేమిస్తాడు. ఆ తర్వాత శకుంతల కూడా దుష్యంతుడిని ఇష్టపడుతుంది. అనంతరం వీరిద్దరి జీవితాల్లో అనుకోని సంఘటనలు జరుగుతాయి. ఇంతకీ అవేంటి? శకుంతల- దుష్యంతుడు చివరకు ఒక్కటయ్యారా లేదా అనేది? తెలియాలంటే మీరు సినిమా చూడాల్సిందే!
‘శాకుంతలం’ మూవీ గురించి సింపుల్ గా చెప్పాలంటే ఇది ఒక అందమైన ప్రేమకథ. కాకపోతే అందులో పెద్దగా ట్విస్టులు ఏం ఉండవు. దీన్ని డైరెక్టర్ గుణశేఖర్ చాలా నీట్ గానే చెప్పారు. మీరు ఇప్పటివరకు మహాభారతం చదవకపోయినా, అసలు శకుంతల అంటే ఎవరో తెలియకపోయినా సరే అస్సలు ప్రాబ్లమ్ రాదు. ఎందుకంటే ఇందులో సింపుల్ గా ఒక్కో విషయాన్ని విడమరిచి మరీ చెప్పారు. కానీ ఇక్కడే అసలు సమస్య ఉంది. ఎందుకంటే ఓ కథని కథలానే చెప్తాను అంటే కొన్నిసార్లు కుదరదు. ‘శాకుంతలం’ విషయంలో ఎగ్జాట్లీ అదే జరిగింది! ఓ సగటు ప్రేక్షకుడు టికెట్ కొని థియేటర్ కి వచ్చాడంటే సంథింగ్ ఎంటర్ టైన్మెంట్ ఎక్స్ పెక్ట్ చేస్తాడు. ఈ మూవీలో సరిగ్గా అది చాలా మిస్ అయింది. కథ ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా అలా ఫ్లోలో వెళ్తూ ఉంటది. ప్రేక్షకుడికి మాత్రం నీరసం వచ్చేస్తుంది.
ఫస్ట్ హాఫ్ విషయానికి వస్తే పసిపాపగా ఉన్న శకుంతలని శాకుంత పక్షులు ఓ చోటకి తెచ్చి విడిచిపెట్టడంతో సినిమా స్టార్ట్ అవుతుంది. కాసేపటికి కన్వ ముని చెంతకు ఈ పాప చేరడం, బ్రహ్మర్షి విశ్వామిత్ర – మేనకలా సంతానమే ఈ చిన్నారి అని, ఎలా పుట్టిందో కూడా ఆ ముని.. ఆశ్రమంలో వున్న వాళ్లకి చెప్తాడు. కొన్నాళ్ళ తర్వాత దుష్యంతుడు ఎంట్రీ, అతడు ఆశ్రమంకి రావడంతోనే శకుంతలని చూసి ప్రేమలో పడటం, ఇలా చాలా విషయాలు ఫాస్ట్ గా జరిగిపోతూ ఉంటాయి. ఓ చిన్న ట్విస్ట్ తో ఇంటర్వెల్ కార్డ్ పడుతుంది. సెకండ్ హాఫ్ లోనూ చాలా సంఘటనలు జరుగుతాయి. చివరకు వీళ్లిద్దరూ ఒక్కటయ్యారా లేదా అనేది ఈ స్టోరీ. అయితే సినిమా చూస్తున్నంత సేపు బాగానే ఉంటుంది కానీ ఫస్ట్ హాఫ్ లో మన ఏ ఎమోషన్ కి కనెక్ట్ కాలేకపోతాం. శకుంతల దుష్యంతుడు లవ్ చేసుకుంటారు ఓకే కానీ వాళ్లిద్దరి మధ్య కెమిస్ట్రీ వర్కౌట్ అయ్యే సరైన సీన్స్ ఒక్కటి కూడా పడలేదు. శకుంతల, దుష్యంతుడు తప్ప మిగతా పాత్రల కోసం స్టార్స్ ని తీసుకున్నారు కానీ వాళ్లలో ఒక్కరిని కూడా సరిగా యూజ్ చేసుకోలేకపోయారు. బహుశా కథ డిమాండ్ చేయలేదేమో!
గుణశేఖర్ అంటే సెట్స్ గురించి పక్కాగా మాట్లాడుకుంటారు. ఇందులో అలాంటి చెప్పుకోదగ్గ సెట్స్ ఒక్కటి కూడా లేదు. చూపించిన ఆ గ్రాఫిక్స్ కూడా.. ఎంత ఘోరంగా ఉన్నాయంటే అంత ఘోరంగా ఉన్నాయి. గ్రాఫిక్స్ అని చాలా ఈజీగా తెలిసిపోతుంది. నెలల గర్భిణి అయిన శకుంతల.. ఓ సీన్ లో కిలోమీటర్ల కొద్దీ నడిచేస్తూ ఉంటుంది. ఇంకా చెప్పాలంటే పరిగెత్తేస్తూ ఉంటుంది. ఈ లాజిక్ ఎందుకు మిస్ అయ్యారో అర్థం కాలేదు. మొత్తం అందరూ హిమాలయాస్ కి దగ్గరలో ఉంటారు కానీ మనలానే చాలా సాదాసీదా బట్టలు వేసుకొని తిరుగుతూ ఉంటారు. ఎంత ఆశ్రమంలో పుట్టి పెరిగితే మాత్రం చలి వేయదా ఏంటి? కొన్ని కొన్ని సీన్స్ చూస్తుంటే.. హిందీ సీరియల్స్, చిన్నప్పుడు మనం టీవీలో చూసిన భాగవతం, పంచతంత్రం సీరియల్స్ ని గుర్తుచేస్తాయి. కథని ఉన్నది ఉన్నట్టు చెబితే సరిపోతుంది అని డైరెక్టర్ గుణశేఖర్ అనుకున్నారేమో? కానీ ప్రేక్షుకులు అలా అనుకోరు కదా.. అక్కడే ఈయన పప్పులో కాలేశారు.
ఈ మూవీ చూసిన తర్వాత మీకు సమంత నచ్చుతుంది. ఇప్పటివరకు చేయని ఓ డిఫరెంట్ రోల్ ఇందులో చేసింది. ఓ ప్రేమికురాలు, గర్భిణి, భర్త దూరమై విరహ వేదన అనుభవించే భార్య.. ఇలా డిఫెరెంట్ వేరియేషన్స్ ని బాగానే పండించింది. కానీ ఈ పాత్రకు ఆమె సగం సగం మాత్రమే సెట్ అయినట్లు అనిపించింది. సొంత డబ్బింగ్ కొన్నిచోట్ల ప్రేక్షకుల్ని ఇబ్బంది పెట్టింది! దుష్యంతుడిగా చేసిన దేవ్ మోహన్.. తనకి చెప్పినట్టు చేసుకుంటూ వెళ్ళాడు. ఆ పాత్రలో కాస్త తెలిసిన నటుడ్ని పెడితే బాగుంటుంది అనిపించింది. మిగతా వారిలో సచిన్ ఖేడ్కర్, మోహన్ బాబు, గౌతమి, ప్రకాష్ రాజ్, శరత్ బాబు, మధుబాల, అనన్య నాగళ్ల.. ఇలా అందరివీ చాలా చిన్న రోల్స్ కానీ ఉన్నంతలో బాగానే చేశారు. ఎక్కడా అతిలా అనిపించదు. అల్లు అర్జున్ ముద్దుల కూతురు అర్హ.. ఓ స్పెషల్ రోల్ తో క్లైమాక్స్ లో ఎంట్రీ ఇస్తుంది. ఇదే ఫస్ట్ సినిమా కాబట్టి ఓకే ఓకే అనిపించింది. అంతా గొప్పగా అయితే ఏం చేయలేదు!
టెక్నికల్ టీమ్ లో డైరెక్టర్ గుణశేఖర్ గురించి ముందు చెప్పాలి. తను అనుకున్న కథని అనుకున్నట్టు తీశారు. కానీ ఇప్పటి టెక్నాలజీ, ఆడియెన్స్ మైండ్ సెట్ ని అర్థం చేసుకోలేకపోయారు. మణిశర్మ పాటలు బాగున్నాయి కానీ సినిమా చూసి బయటకు వచ్చాక ఏం గుర్తుండవ్. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకి సెట్ అయింది. కానీ పెద్దగా గూస్ బంప్స్ లాంటివి అయితే ఎక్స్ పెక్ట్ చేసి వెళ్లొద్దు. గ్రాఫిక్స్ డిపార్ట్ మెంట్ ఇంకాస్త బాగా వర్క్ చేసి ఉండాల్సింది. 3D అన్నారు గానీ మాములు సినిమా తీసుంటే బాగుంటుంది కదా అనిపించింది. ఏదో ఒకటి రెండు సీన్స్ లో కాస్త 3D ఎఫెక్ట్ లా అనిపిస్తుంది అంతే! క్లోజప్స్ షాట్స్ ఎక్కువగా ఉన్నాయి. కెమెరా యాంగిల్స్ అయితే కొన్నిచోట్ల చాలా వరస్ట్! ఓ చోట పెద్దగా కనిపించిన మనుషులు, మరోచోట చిన్నగా కనిపిస్తారు. ఇదంతా గ్రీన్ మ్యాట్ నుంచి గ్రాఫిక్స్ లోకి కన్వర్ట్ చేసినప్పుడు పొరపాట్లు అనుకుంటా బహుశా!? ఓవరాల్ గా చూసుకుంటే.. శాకుంతలం బాగుందని చెప్పలేం, అలా అని బాగోలేదు అని కూడా చెప్పలేం. అది అంతే!?