SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » reviews » Kalyanam Kamaneeyam Movie Review Rating In Telugu

‘కళ్యాణం కమనీయం’ సినిమా రివ్యూ

    Updated On - Sat - 28 January 23
    • facebook
    • twitter
    • |
        Follow Us
      • Suman TV Google News

కళ్యాణం కమనీయం

14-01-2023, రొమాంటిక్ కామెడీ డ్రామా, 1h 46m U
థియేటర్స్ లో
  • నటినటులు:సంతోష్ శోభన్, ప్రియా భవానీ శంకర్, దేవిప్రసాద్, పవిత్రా లోకేష్ తదితరులు
  • దర్శకత్వం:అనిల్ కుమార్
  • నిర్మాత:యూవీ క్రియేషన్స్
  • సంగీతం:శ్రవణ్ భరద్వాజ్
  • సినిమాటోగ్రఫీ:కార్తీక్ ఘట్టంనేని

Rating

2/5

సంక్రాంతి అనగానే స్టార్ హీరోల సినిమాలే కాదు ప్రతిసారి ఎవరో ఒక చిన్న హీరో మూవీ కూడా థియేటర్లలో రిలీజ్ అవుతూ ఉంటుంది. అలా ఈసారి చిరు, బాలయ్య సినిమాలతోపాటు సంతోష్ శోభన్ నటించిన ‘కళ్యాణం కమనీయం’ కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ‘ఏక్ మినీ కథ’, ‘మంచిరోజులొచ్చాయి’ లాంటి చిత్రాలతో తన మార్క్ క్రియేట్ చేసుకుంటున్నాడు సంతోష్ శోభన్. ఇక ప్రభాస్ సొంత బ్యానర్ అయిన యూవీ క్రియేషన్స్ నిర్మించిన ఈ సినిమాతో ప్రియా భవానీ శంకర్ హీరోయిన్ గా పరిచయమైంది. జనవరి 14న విడుదలైన ‘కళ్యాణం కమనీయం’ మూవీ ఎలా ఉంది? ఏంటనేది ఇప్పుడు రివ్యూలో చూద్దాం!

కథ:

శివకు(సంతోష్ శోభన్) ఉద్యోగం ఉండదు. ఆ విషయం తెలిసి కూడా శ్రుతి(ప్రియా భవానీ శంకర్) ప్రేమిస్తుంది. పెద్దల్ని ఒప్పించి పెళ్లి కూడా చేసుకుంటుంది. ఎవరినీ డబ్బులు అడగొద్దని భర్తకు చెప్పి.. అతడి ప్రతి అవసరానికి డబ్బులిస్తూ ఉంటుంది. అంతా ఆనందంగా ఉందనుకున్న శివకు ఒక్కసారిగా షాక్ తగులుతుంది. ఉద్యోగం చేయాల్సిందేనని శివకు శ్రుతి అల్టిమేటం ఇస్తుంది. ఇక భార్యాభర్తల జర్నీలో చివరకు ఏం జరిగింది? శ్రుతికి ఉద్యోగం వచ్చిందని చెప్పిన శివ.. క్యాబ్ డ్రైవర్ అవతారం ఎందుకెత్తాడు? అసలు శివ, శ్రుతి మధ్య గొడవలకు మెయిన్ రీజన్ ఎవరు? చివరకు ఏమైంది అనేది తెలియాలంటే థియేటర్లలో మీరు సినిమా చూడాల్సిందే.

kalyanam kamaneeyam

విశ్లేషణ:

భార్యాభర్తల మధ్య అనుబంధం అనే కాన్సెప్ట్ తో ఫన్ ఎంటర్ టైనర్ గా తీసిన సినిమా ‘కళ్యాణం కమనీయం’. ఎలాంటి వల్గారిటీ, డబుల్ మీనింగ్ డైలాగ్స్ లేకుండా తీసిన న్యూ ఏజ్ ఫ్యామిలీ డ్రామా ఇది. చాలా నార్మల్ స్టోరీ కావడంతో పాటు యూత్ కి కచ్చితంగా రిలేట్ అవుతుంది. సింపుల్ స్టోరీ, స్క్రీన్ ప్లే, సీన్స్ తోనే సినిమా తీశారు. ఈ జనరేషన్ యూత్ అందరూ.. ఈ సినిమాలో తమను తాము చూసుకునేలా డైరెక్టర్ తీశాడు. ఇక హీరోహీరోయిన్లుగా చేసిన సంతోష్ శోభన్, ప్రియా భవానీ శంకర్.. చూడటానికి అందంగా కనిపించారు. జోడీ ఫ్రెష్ గా ఉండటంతో మంచి ఫీలింగ్ కలిగింది. భర్తకు ఉద్యోగం లేకపోవడం, ఖర్చులకు భార్య డబ్బులివ్వడం అనే కాన్సెప్ట్ గతంలో వచ్చిన ఓ తెలుగు సినిమాను గుర్తుచేస్తుంది. ఈ విషయంలో రెండింటికి కాస్త పోలికలు ఉన్నట్లు అనిపిస్తుంది.

kalyanam kamaneeyam

ఇక ‘కళ్యాణం కమనీయం’ ట్రైలర్ చూస్తే దాదాపు మీకు స్టోరీ అర్థమైపోతుంది. కథలో పెద్దగా ట్విస్టులు ఏం ఉండవు. చిన్న చిన్నవి ఉన్నా కూడా సినిమా చూస్తుంటే మీకు ఫ్లోలో తెలిసిపోతాయి కూడా. అలానే ఆ ట్విస్టు ఎలా రివీల్ అవుతుందనేది కూడా మీకు ముందే తెలిసిపోతుంది. సినిమాలో హీరో, అతడి ఫ్రెండ్స్ మధ్య కామెడీ సీన్స్ రొటీన్ లా అనిపిస్తాయి. వీటి విషయంలో ఇంకాస్త శ్రద్ధ తీసుకుని ఉంటే బాగుండేది అనిపించింది. అలానే మ్యారేజ్ అనే విషయం గురించి ఇంకా డెప్త్ కి వెళ్తే ప్రేక్షకులకు నచ్చుతుంది. కానీ దర్శకుడు అనిల్ ఎందుకో ఆవైపు ఎక్కువగా దృష్టి పెట్టలేదనిపించింది.

kalyanam kamaneeyam

నటీనటులు-టెక్నికల్ టీమ్ పనితీరు:

గత సినిమాల్లో డిఫరెంట్ రోల్స్ లో కనిపించిన సంతోష్ శోభన్.. పక్కింటి అబ్బాయి రోల్ లో చక్కగా నటించాడు. ఉద్యోగం లేని కుర్రాడు, భర్తలా ఎమోషన్స్ ని బాగానే వర్కౌట్ చేశాడు. ఇక పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్న యువకులు అందరూ కూడా ఏదో ఓ సీన్ లో శివ క్యారెక్టర్ కు రిలేట్ అవుతారు. తమిళంలో ఇప్పటికే చాలా సినిమాలు చేసిన ప్రియాభవానీ శంకర్ ఈ సినిమాలో ఆకట్టుకునే ఫెర్ఫార్మెన్స్ ఇచ్చింది. చాలా సీన్లలో కళ్లతో యాక్ట్ చేసింది. నవ్వు కూడా చాలా ప్లెజెంట్ గా ఉంది. హీరోహీరోయిన్ల జోడీ చూడటానికి కలర్ ఫుల్ గా ఉంది. మిగిలిన రోల్స్ లో దేవి ప్రసాద్, పవిత్రా లోకేష్, కేదార్ శంకర్ తదితరులు ఉన్నంతలో బాగానే చేశారు. విలన్ గా చేసిన సత్యం రాజేష్.. ఉన్న మూడు నాలుగు సీన్లలో ఆకట్టుకున్నాడు. ఇక శ్రవణ్ భరద్వాజ్ కంపోజ్ చేసిన పాటలు బాగున్నాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సరిగ్గా సరిపోయింది. కార్తిక్ ఘట్టమనేని సినిమాటోగ్రఫీ రిచ్ గా ఉంది. యూవీ క్రియేషన్స్ నిర్మాణ విలువలు అదిరిపోయాయి. ప్రతి సీన్ లోనూ వారి ఖర్చు పెట్టిన డబ్బులు కనిపించింది.

kalyanam kamaneeyam

ప్లస్ పాయింట్స్:

  • సంతోష్ శోభన్, ప్రియాభవానీ జోడీ
  • సినిమాటోగ్రఫీ
  • యువీ క్రియేషన్స్ నిర్మాణ విలువలు

మైనస్ పాయింట్స్:

  • ప్రిడిక్టబుల్ స్టోరీ
  • రొటీన్ కామెడీ

చివరగా: కొత్తజంటలకు టైమ్ పాస్ మూవీ ‘కళ్యాణం కమనీయం’!

రేటింగ్: 2/5

(గమనిక: ఈ రివ్యూ సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే)

Tags :

  • Kalyanam Kamaneeyam Movie
  • Movie reviews
  • Priya Bhavani Shankar
  • Santosh Shoban
  • UV Creations
Read Today's Latest reviewsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

ఆ విషయంలో ప్రియుడికి కఠిన షరతులు పెట్టిన హీరోయిన్‌ ప్రియ!

ఆ విషయంలో ప్రియుడికి కఠిన షరతులు పెట్టిన హీరోయిన్‌ ప్రియ!

  • లైంగిక వేధింపులపై ప్రముఖ నటి సంచలన వ్యాఖ్యలు!

    లైంగిక వేధింపులపై ప్రముఖ నటి సంచలన వ్యాఖ్యలు!

  • ఆ డైరెక్టర్ తో రెచ్చిపోతున్న స్టార్ హీరోయిన్! ఆ పిక్స్ వైరల్!

    ఆ డైరెక్టర్ తో రెచ్చిపోతున్న స్టార్ హీరోయిన్! ఆ పిక్స్ వైరల్!

  • ఈ చిన్నారిని గుర్తుపట్టారా?.. కళ్లతోనే మత్తెక్కించే స్టార్‌ హీరోయిన్‌ ఇప్పుడు!

    ఈ చిన్నారిని గుర్తుపట్టారా?.. కళ్లతోనే మత్తెక్కించే స్టార్‌ హీరోయిన్‌ ఇప...

  • బాయ్ ఫ్రెండ్‌తో వెకేషన్‌ ఎంజాయ్ చేస్తున్న ప్రముఖ నటి.. వీడియో వైరల్

    బాయ్ ఫ్రెండ్‌తో వెకేషన్‌ ఎంజాయ్ చేస్తున్న ప్రముఖ నటి.. వీడియో వైరల్

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam