ఇటీవల సినీ నిర్మాణంలో, మేకింగ్‌లో ఎన్నో మార్పులు కనిపిస్తున్నాయి. ట్రెండ్ అనే విషయాన్నీ పక్కనపెట్టి ప్రయోగాత్మక సినిమాలు, కొత్త కొత్త కథలను ప్రేక్షకులకు అందిస్తున్నారు. అయితే.. ఇండస్ట్రీలో ఎక్స్పరిమెంటల్ మూవీస్ చేసే హీరోలు చాలామంది ఉన్నారు. కానీ.. కెరీర్ ప్రారంభం నుండి రెగ్యులర్ ఫార్మాట్‌లో కాకుండా ఎక్స్పరిమెంటల్ సినిమాలే చేస్తున్న ఒకే ఒక్క స్టార్, విలక్షణ నటుడు చియాన్ విక్రమ్. విక్రమ్‌కి తమిళంలో ఉన్నట్లే తెలుగులో కూడా మంచి ఫ్యాన్ బేస్ ఉంది. ముఖ్యంగా విక్రమ్ సినిమాలకు ఫ్యాన్స్ ఎక్కువనే చెప్పాలి. ఇక చివరిగా మహాన్ సినిమాతో హిట్టు కొట్టిన విక్రమ్.. ఇప్పుడు కోబ్రా అనే మిస్టరీ థ్రిల్లర్‌తో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. డిమాంటి కాలనీ, అంజలి సిబిఐ ఫేమ్ డైరెక్టర్ అజయ్ జ్ఞానముత్తు కోబ్రా మూవీని తెరకెక్కించాడు. ఇప్పటికే పాటలు, టీజర్, ట్రైలర్స్‌తో.. విక్రమ్ క్యారెక్టర్‌లోని వేరియేషన్స్‌తో కోబ్రాపై భారీ అంచనాలు క్రియేట్ చేశాయి. అదిగాక ఈ సినిమాకు ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ సంగీతం అందించగా.. మూవీని ఎస్ఎస్ లలిత్ కుమార్ నిర్మించారు. ఎట్టకేలకు వినాయక చవితి సందర్బంగా ప్రేక్షకుల ముందుకొచ్చిన కోబ్రా మూవీ.. ఎలా ఉందో రివ్యూలో చూద్దాం!
కథ:
మది(చియాన్ విక్రమ్) ఓ సాధారణ మ్యాథమెటిక్స్ టీచర్. కానీ.. అందరూ అతన్ని మ్యాథ్స్‌లో జీనియస్ అంటుంటారు. అతను వేసే లెక్కలు, చేసే పనులు కూడా ఎవరి ఊహకు అందవు. ఓవైపు ఇంటర్ పోల్ ఆఫీసర్ అస్లాన్(ఇర్ఫాన్ పఠాన్) ఒడిశా సీఎం, స్కాట్ ల్యాండ్ ప్రిన్స్‌లను ఆనవాళ్లు లేకుండా చంపిన హంతకుడి కోసం వెతుకుంటాడు. అయితే.. ఆ చనిపోయిన బిగ్ షాట్స్‌కి, ఫేమస్ బిజినెస్ మ్యాన్ రిషి(రోషన్ మాథ్యూ)తో సంబంధాలు ఉన్నాయని తెలుసుకుంటాడు. ఈ క్రమంలో జరిగిన హత్యల వెనుక మ్యాథ్స్ ఉందని.. ఆ హత్యలన్నీ మ్యాథ్స్ జీనియస్ చేశాడని అంచనా వేస్తారు. ఇదే క్రమంలో పలు షాకింగ్ ట్విస్టులు ఎదురవుతాయి. మరి ట్విస్టులు ఏంటి? అసలు కోబ్రా ఎవరూ? మ్యాథ్స్ టీచర్ మదికి, హత్యలకు ఏమైనా సంబంధం ఉందా? కోబ్రా లవ్ ఏమైంది? చివరికి ఇంటర్ పోల్ ఆఫీసర్ ఏం చేశాడు? కోబ్రా ఎలాంటి సందేశం ఇచ్చింది అనేది తెరపై చూడాల్సిందే.
విశ్లేషణ:
హీరో విక్రమ్ సినిమాలంటే కోలీవుడ్‌తో పాటు తెలుగు ప్రేక్షకులు కూడా అంతే ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. అపరిచితుడు, విలన్, శివపుత్రుడు, మల్లన్న, ఇంకొక్కడు, ఐ, మహాన్ లాంటి డిఫరెంట్ సినిమాలతో మెప్పించిన విక్రమ్.. ఇప్పుడు మిస్టరీ థ్రిల్లర్ నేపథ్యంలో కోబ్రా సినిమా చేశాడు. అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలో తెరకెక్కిన కోబ్రా.. పాటలు, ట్రైలర్ ఇలా అన్నివిధాలా ప్రేక్షకులలో అంచనాలు పెంచేశాయి. అందులోనూ విక్రమ్ దాదాపు ఏడు వేరియేషన్స్‌లో కనిపించనున్నాడని తెలిసి అందరిలో కోబ్రాపై ఇంటరెస్ట్ రెట్టింపు అయ్యిందనే చెప్పాలి.
ఇక సినిమాలోకి వెళ్తే.. థ్రిల్లర్ మూవీ కాబట్టి.. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తోనే కథ మొదలైంది. యంగెస్ట్ బిజినెస్ మ్యాన్ రిషి(రోషన్) క్యారెక్టర్‌ని విలన్‌గా పరిచయం చేసిన దర్శకుడు.. ఆ వెంటనే ఒడిశా సీఎం, స్కాట్ ల్యాండ్ ప్రిన్స్ హత్యలకు గురైన సీన్స్‌తో హీరో కోబ్రాని ఇంట్రడ్యూస్ చేశాడు. కట్ చేస్తే.. మ్యాథ్స్‌లో జీనియస్ అయిన మది ఓ సాధారణ టీచర్. అతన్ని ప్రేమించే అమ్మాయి భావన(శ్రీనిధి శెట్టి). దాదాపు నాలుగేళ్లుగా మదిని పెళ్లికి ఒప్పించేందుకు ట్రై చేస్తుంటుంది. ఇలా ఓవైపు ఇంటరెస్టింగ్ మిస్టరీ కథను చెబుతూనే.. మరోవైపు అందమైన లవ్ స్టోరీని స్క్రీన్ ప్లేలో జోడించి మ్యాజిక్ చేసే ప్రయత్నం చేశాడు దర్శకుడు.
ఫస్ట్ హాఫ్‌లో క్యారెక్టర్స్‌ని చాలా ఇంటరెస్టింగ్‌గా పరిచయం చేస్తూనే.. కథలోకి తీసుకెళ్లారు. ఓవైపు కథ.. మరోవైపు మ్యాథ్స్ టీచర్ లైఫ్, లవ్ స్టోరీ.. ఫ్యామిలీ ఎమోషన్స్‌ని బాగా ప్లాన్ చేశారు. ఫస్టాఫ్‌లో మర్డర్స్ లో ఆనవాళ్లు లేకుండా తప్పించుకున్న మ్యాథ్స్ జీనియస్‌ని వెతికే సీక్వెన్స్ చాలా ఇంటరెస్టింగ్‌గా రాసుకున్న దర్శకుడు.. అలాగే మది, భావన లవ్ సీన్స్ తో కంటతడి పెట్టించాడు. ముఖ్యంగా మది, భావనల మధ్య జరిగే సంభాషణలు కొత్తగా.. ఎమోషనల్ గా టచ్ చేస్తాయి. ఇంతలోనే హీరో క్యారెక్టర్ లో డిఫెక్ట్ ఉందేమో అనిపించేలా చేశారు.. కానీ.. ఇంటర్వెల్ కి వచ్చేసరికి ఎవరూ ఊహించని బిగ్ ట్విస్టు రివీల్ అవుతుంది.
సినిమా ప్రారంభం ఎంత ఇంటరెస్టింగ్ గా ఉందో.. ఇంటర్వెల్ అంతకంటే ఎక్కువ ఆసక్తి రేపుతుంది. ఎందుకంటే.. సెకండాఫ్ లో ఏం జరగబోతుందో అనే ఆత్రుత కలిగేలా ట్విస్టు పెట్టాడు దర్శకుడు. ఇక సెకండాఫ్ చాలా ఆసక్తిగా మొదలవుతుంది. ఇంటర్ పోల్ సర్వేలో మ్యాథ్స్ జీనియస్ మది.. కాదు కోబ్రా అనే విషయంతో సినిమాలో మ్యాథ్స్ జీనియస్ లు ఇద్దరు ఉన్నారని.. మది, కోబ్రా ఒకేలా ఉన్నారని చెప్పే సీన్స్ థ్రిల్లింగ్ గా ఉంటాయి. సెకండాఫ్ లో మది, కోబ్రాల ఫ్లాష్ బ్యాక్.. ఆ హత్యలకు వెనుక కారణాలను చూపిస్తూనే.. లవ్, ఫ్యామిలీ ఎమోషన్స్, ఇంటర్ పోల్ ఇన్వెస్టిగేషన్ ఆసక్తిగా చూపించారు.
ఈ సినిమా నిడివి చాలా ఎక్కువ ఉన్నప్పటికీ.. అది సెకండాఫ్ లో కథ స్లో అవ్వడంతో గుర్తొస్తుంది. ప్రీ క్లైమాక్స్ అంచనా వేసేయొచ్చు.. చివరిగా క్లైమాక్స్ ఎక్సపెక్ట్ చేయలేము. క్లైమాక్స్ ని చాలా ఎమోషనల్ గా ఎండ్ చేశారు. అయితే.. హీరో మదికి చిన్నప్పటి నుండే హెల్యూస్ నేషన్ ఉన్న విషయం ఒకటి ప్రేక్షకులకు బోర్ అనిపించవచ్చు. ఎందుకంటే.. సెకండాఫ్ లో కొన్ని క్యారెక్టర్స్ కన్ఫ్యూషన్ తో పాటు.. అనవసరం అనిపిస్తాయి. సినిమాను స్టార్ట్ చేసిన విధంగానే తీసుకెళ్తే బాగుండు అనిపిస్తుంది. కానీ.. సినిమాను మాక్సిమమ్ తన సంగీతంతో లేపాడు ఏఆర్ రెహమాన్. పాటలు చక్కగా ఉన్నాయి.. ఇక బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ గురించి చెప్పక్కర్లేదు.. ఎప్పటిలాగే చింపేశాడు.
ఇక సినిమాలో సిట్యుయేషన్ బట్టి విక్రమ్ క్యారెక్టర్స్ చేంజ్ చేయడం ఫీస్ట్ అనే చెప్పాలి. దాదాపు ఏడు వేరియేషన్స్ లో ఎక్కడా తేడా కొట్టకుండా అద్భుతంగా నటించాడు. మరోసారి తనలా ఎవరూ రిస్క్ చేయలేరని ప్రూవ్ చేశాడు. ఇక హీరోయిన్ శ్రీనిధి శెట్టి క్యారెక్టర్ నిడివి తక్కువే అయినా బాగుంది. ఇంటర్ పోల్ ఆఫీసర్ అస్లాన్ గా క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్.. డెబ్యూలా కాకుండా సీనియర్ యాక్టర్ లా మెప్పించారు. విలన్ రిషి క్యారెక్టర్ లో మలయాళం యాక్టర్ రోషన్ నటన బాగుంది. కానీ.. అతని క్యారెక్టర్ ఎండింగ్ అలా కాకుండా వేరేలా ఉంటే బాగుండేది అనిపిస్తుంది. ఇతర పాత్రలలో కేఎస్ రవికుమార్, సార్పట్ట జాన్.. తదితరులు ఆకట్టుకున్నారు.
కోబ్రా కథను కొత్తగా రాసుకున్న దర్శకుడు.. సెకండాఫ్ లో హెల్యూస్ నేషన్ ఎక్కువ పెట్టి కన్ఫ్యూస్ చేశాడు. ఓవైపు ఇన్వెస్టిగేషన్, ఓవైపు ఫ్యామిలీ ఎమోషన్స్, లవ్ బాగానే ఉన్నా.. హెల్యూస్ నేషన్ లో వచ్చే క్యారెక్టర్స్ రిపీట్ చేయడంతో ఆ థ్రిల్ మిస్ అయిన ఫీలింగ్ కలుగుతుంది. స్క్రీన్ ప్లేలో తడబడ్డాడు. అదిగాక సినిమా లెన్త్ మైనస్ అనే చెప్పాలి. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. విజువల్స్ అన్నీ గ్రాండ్ గా ఉన్నాయి. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా రిచ్ గా ఉన్నాయి. మరి కోబ్రా లెన్త్ తక్కువగా ఉంటే మరింత ఎక్కువమంది ప్రేక్షకులకు రీచ్ అయ్యే అవకాశం ఉంది.
ప్లస్‌లు:
మైనస్‌లు:
చివరిమాట:
కోబ్రా.. చియాన్ విక్రమ్ విశ్వరూపమే! కానీ..
గమనిక: ఈ రివ్యూ సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.