దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె వైఎస్ షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టి అందరిని ఆశ్చర్యపరిచిన సంగతి తెలిసిందే. 2019 ఎన్నికల ముందు వరకు తన అన్న ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గెలుపు కోసం షర్మిల ఎంత కష్టపడ్డారో రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు తెలుసు. ఇక జగన్ అధికారంలోకి వచ్చాక.. షర్మిలకు పార్టీలో తగిన ప్రాధాన్యత దక్కలేదు. ఆ తర్వాత ఆమె పార్టీకి దూరంగా ఉంటూ వచ్చారు. ఈ క్రమంలో అనూహ్య రీతిలో తెలంగాణలో YSRTP స్థాపించారు. అయితే కేసీఆర్‌కు ప్రయోజనం చేకూర్చేందుకు షర్మిల పార్టీ పెట్టారని ఇప్పటికి చాలామంది బలంగా నమ్ముతున్నారు. ఈ క్రమంలో ప్రస్తుతం షర్మిల చేసిన కామెంట్స్ రాజకీయవర్గాల్లో చర్చకు దారి తీశాయి.
ఇది కూడా చదవండి: ఏపీలోనూ వై.ఎస్. షర్మిల పార్టీ! జగన్ పై ఉండవల్లి మాస్టర్ ప్లాన్!
షర్మిల ప్రజాప్రస్థానం పేరుతో పాదయాత్ర చేస్తున్నారు. ఖమ్మం జిల్లాలో పాదయాత్ర కొనసాగుతుంది. దానిలో భాగంగా భద్రాచలంలో నిర్వహించిన బహిరంగ సభలో షర్మిల ప్రసంగించారు. రాష్ట్రంలో అధికార పార్టీతో పాటు ప్రతిపక్షాలు సైతం తమ బాధ్యతను మరిచాయని దుయ్యబట్టారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీని గెలిపిస్తే… అందరి సంక్షేమం కోసం పథకాలు తీసుకువస్తాం అని తెలిపారు. అంతేకాక తెలంగాణలో ఎందుకు పార్టీ పెట్టాల్సి వచ్చిందో తెలిపారు షర్మిల.
ఇది కూడా చదవండి: వీడియో: పాదయాత్రలో YS షర్మిలపై తేనెటీగల దాడి
ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ.. ‘‘అత్త మీద కోపం దుత్త మీద చూపిస్తే లాభం లేదని.. అన్నతో గొడవుంటే ఏపీలో పార్టీ పెట్టాలి గానీ.. ఇక్కడ పార్టీ పెట్టడం ఏంటని మంత్రి కేటీఆర్ అడిగారు. ఆయన అడిగింది నిజమే. ఆ ఇంగిత జ్ఞానం నాకూ ఉంది. కానీ అందులో నిజం లేదు కాబట్టే తెలంగాణలో పార్టీ పెట్టాను. అసలు నేను పార్టీ పెట్టడానికి కారణమే కేసీఆర్. ఆయన దిక్కుమాలిన పాలన వల్లే వైఎస్సార్ తెలంగాణ పార్టీ స్థాపించబడింది. అంతే తప్ప మా అన్నతో నాకు ఎలాంటి గొడవలు లేవు’’ అని స్పష్టం చేశారు.
నాకు మా అన్నకు ఎలాంటి విభేదాలు లేవు.
విభేదాలు ఉంటే ఆంధ్రాలో పార్టీ పెడతాను కానీ ఇక్కడ ఎందుకు పెడతాను – షర్మిలమ్మ🔥 pic.twitter.com/9dcnwm2lCv
— 𝐘𝐒𝐑𝐓𝐏 (@YSSR2023) April 25, 2022
ఇది కూడా చదవండి: షర్మిలకు క్షమాపణలు చెప్పిన మంత్రి నిరంజన్ రెడ్డి
అంతేకాక.. ‘‘మా పార్టీకి వ్యూహకర్తలు అవసరం లేదు. ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోవడం లేదు. ఇక్కడున్నది రాజశేఖర్‌రెడ్డి బిడ్డ. వైఎస్సార్ రక్తం. సింహం సింగిల్‌గా వస్తుంది. మేం ఎవరి ఏజెంట్లమూ కాదు. మాకు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలతో పొత్తు అవసరం లేదు. టీఆర్ఎస్‌తో అసలే పొత్తు పెట్టుకోం. మాకు వైఎస్సార్ బొమ్మ, పేరు ఉంది. వైఎస్సార్ అనే మూడు అక్షరాల పేరు చాలు. ఆయన అందించిన సంక్షేమ పాలన ఇంకా కోట్లమంది తెలుగు ప్రజల గుండెల్లో నిలిచే ఉంది’ అని షర్మిల స్పష్టం చేశారు. మరి కేసీఆర్ వల్లనే తెలంగాణలో పార్టీ పెట్టానన్న షర్మిల వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మాకు ఎవరితోనీ పొత్తులు అవసరం లేదు.
సింహం సింగిల్ గా వస్తుంది – షర్మిలమ్మ💥 pic.twitter.com/xHm6WLSWxQ
— 𝐘𝐒𝐑𝐓𝐏 (@YSSR2023) April 25, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.