ఆంధ్ర ప్రదేశ్ మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ పూర్తయిన సంగతి తెలిసిందే. ఈ కేబినెట్ కూర్పు వైసీపీలో వివాదాన్ని రాజేసింది. ముఖ్యంగా పాత మంత్రుల్లో కొందరు.. తిరిగి తమను మంత్రివర్గంలోకి తీసుకోకపోవడంపై తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. రెండోసారి కేబినెట్‌లో చోటు దక్కకపోవడంతో బాలినేని శ్రీనివాసరెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం సీఎం జగన్ మోహన్ రెడ్డితో భేటీ తరువాత ఆయన కాస్త కూల్ అయ్యారు. మరో నేత, మాజీ హోంమంత్రి మేకతోటి సుచరిత సైతం మళ్లీ పదవి దక్కకపోవడంపై అసంతృప్తిగా ఉన్నారు. ఎమ్మెల్యే పదవికి సైతం రాజీనామా చేశారు. ఈ క్రమంలో టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య.. సుచరితకు మద్దతుగా ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఇది వైరల్‌గా మారింది.
ఇది కూడా చదవండి: AP మంత్రివర్గ విస్తరణ.. షాకిచ్చిన మేకతోటి సుచరిత!
వర్ల రామయ్య.. ‘ముఖ్యమంత్రి గారు, అసంతృప్తి వ్యక్తం చేసిన మాజీ హోంమంత్రి సుచరిత పట్ల కఠినంగా వ్యవహరించలేరు. ఎందుకంటే.. ఆమె భర్త ఓ పెద్ద ఆదాయ పన్నుల శాఖాధికారి. అందునా, గత పదహేను సంవత్సరాలుగా, జగన్ గారి ఆర్థిక లావాదేవీలన్నీ పూర్తిగా, లోతుగా తెలిసిన వ్యక్తి. అందుకే, సుచరితతో ముఖ్యమంత్రి రాజీ పడవలసిందే’ అంటూ ట్వీట్ చేశారు.
ముఖ్యమంత్రి గారు, అసంతృప్తి వ్యక్తo చేసిన మాజీ హోo మంత్రి సుచరిత పట్ల కఠినంగా వ్యవహరించలేరు. ఎందుకంటే, ఆమె భర్త ఓ పెద్ద ఆదాయపన్నుల శాఖాధికారి.అందునా,గత పదహేను సంవత్సరాలుగా,జగన్ గారి ఆర్ధిక లావాదేవీలన్నీ పూర్తిగా,లోతుగా తెలిసిన వ్యక్తి. అందుకే,సుచరితతో ముఖ్యమంత్రి రాజీ పడవలసిందే.
— Varla Ramaiah (@VarlaRamaiah) April 11, 2022
ఇది కూడా చదవండి: పదవుల కోసం వేంపర్లాడటం మా ఇంట వంట లేదు: మేకతోటి సుచరిత
ఇక రెండో సారి తనకు మంత్రి పదవి దక్కకపోవడంతో.. మేకతోటి సుచరిత తన ఎమ్మెల్యే పదవికి సైతం రాజీనామా చేశారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. తనను మంత్రి పదవి నుంచి తొలగించినందుకు బాధగా లేదని.. కాకపోతే తొలగించిన తీరు తనను కలచివేసింది అన్నారు. వ్యక్తిగత కారణాల వల్లే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశానని… చివరి వరకు జగన్ నాయకత్వంలో నడుస్తానని స్పష్టం చేశారు. వైఎస్సార్సీపీలో ఇతర క్యాడర్ ఎవరూ రాజీనామాలు చేయొద్దని ఆమె కోరారు. ఇక వర్ల రామయ్య చేసిన ట్వీట్‌పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.