ఏపీ పై తెలంగాణ మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ లో కరెంట్ లేదు, నీళ్లు లేవని పరోక్షంగా విమర్శించారు. అక్కడ రోడ్లన్నీ అధ్వాన్నంగా ఉన్నాయని కేటీఆర్ అన్నారు. డాయ్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఏపీపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారాన్ని రేపాయి. కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఏపీ మంత్రులు తీవ్రస్థాయిలో విమర్శించారు. అభివృద్ధి అంటే కేవలం ఒక నగరం కాదని ఒక మంత్రి అంటే, తను హైదరాబాద్ లో కరెంట్ లేక జనరేటర్ వేసుకున్న అంటూ మరో మంత్రి అన్నారు. ఇలా టీఎస్ మంత్రి కేటీఆర్ పై ఏపీ మంత్రులు ఏ రేంజ్ లో విరుచపడ్డారు. తాజాగా తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్.. ఏపీ మంత్రులకు కౌంటర్ ఇచ్చారు. కరోనా టైమ్ లో హైదరాబాద్ కి క్యూ కట్టింది ఏవరో తెలుసంటూ విమర్మించారు.
శనివారం తలసాని శ్రీనివాస యాదవ్ మీడియాతో మాట్లాడుతూ..” మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను ఏపీ నేతలు కావాలనే ప్రచారం చేస్తున్నారు. కేటీఆర్ వ్యాఖ్యలకు అనవసరంగా వైసీపీ నేతలు ఉలిక్కిపడుతున్నారు. మమ్మల్ని ఏపీ ప్రతిపక్ష పార్టీ అనుకుంటున్నారా?. ఏపీని మా కంటే అభివద్ధి చేస్తే సంతోషిస్తాం. బొత్స సత్యనారాయణ మాటలు అర్థరహితం. బొత్స.. హైదరాబాద్ వస్తే ఎప్పుడు జనరేటర్ వినియోగించారో చెప్పాలన్నారు. హైదరాబాద్ లో కరెంట్ లేదనండంలో అర్థం లేదు. కరెంట్ లేకుంటే శుభకార్యాలు ఇక్కడెందుకు చేస్తున్నారు.
ఇదీ కూడా చదవండి: KTR: మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలపై ఏపి మంత్రుల స్పందన!
ఏపీ నేతలు తొందరపాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. కోతలు లేని విద్యుత్, మౌలిక వసతుల కల్పన వల్లే నగరానికి పెట్టుబడులు పోటెత్తుతున్నాయి. దేశంలోని కంపెనీలే కాకుండా ప్రపంచ దేశాలవి కూడా హైదరాబాద్ లో పెట్టుబడులు చేస్తున్నాయి. ఏపీలో పవర్ కట్ పై వాళ్లే బహిరంగంగా ప్రకటించుకున్నారు” అంటూ ఏపీ మంత్రులపై విరుచుపడ్డాడు. మంత్రుల తీరుపై ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి స్పందించాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ వైసీపీ నేతలు పద్ధతి తప్పి మాట్లాడటం సరికాదని తలసాని ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా సమయంలో హైదరాబాద్‌లో వైద్యం కోసం ఎంత మంది నేతలు ఇక్కడికి క్యూ కట్టారో తెలుసంటూ సెటైర్లు వేశారు.మరి.. ఏపీ మంత్రుల పై తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.