ఏపీ కేబినెట్ లో కీలక పరిణామం చోటు చేసుకోనుంది. రాజీనామాలకు మంత్రులందరూ సిద్దంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే విద్యాశాఖ మంత్రి పని చేసిన ఆదిమూలపు సురేష్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశాడు.ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కోసం నా తల కోసుకోవటానికి కూడా సిద్ధం అని ప్రకటించారు.
ఇది కూడా చదవండి: చంద్రబాబు మంచి ముఖ్యమంత్రే.. నో డౌట్: డిప్యూటీ సీఎం ధర్మాన
ముఖ్యమంత్రివి ఉన్నత ప్రమాణాలు.. ఆయన లక్ష్యాలకు అనుగుణంగా పని చేయటానికి శాయశక్తులా పని చేశానని, విద్యాశాఖ మంత్రిగా ముఖ్యమంత్రి నాకు గొప్ప అవకాశం ఇచ్చారంటూ సురేష్ తెలిపారు. తాను ముఖ్యమంత్రి జగన్ నేతృత్వంలో పని చేయటం గొప్ప అనుభవంగా భావిస్తానని కూడా తెలిపారు మంత్రి ఆదిమూలపు సురేష్. తాజాగా మంత్రి సురేష్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమవుతున్నాయి. సురేష్ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.