ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యంగా నీళ్లు, నిధులు, నియమాకాల విషయంలో తెలంగాణకు తీరని అన్యాయం జరుగుతుందని భావించి.. ప్రత్యేక రాష్ట్రం కోసం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ సమాజం ఒక్కతాటిపైకి వచ్చి.. ఎన్నో పోరాటలు చేసి.. ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకుంది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఉమ్మడి రాష్ట్రంలో ఏ అన్యాయాలకు వ్యతిరేకంగా పొరాడి.. ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డామో.. వాటి సాధనకు కేసీఆర్ నేతృత్వంలో కొత్తగా ఏర్పడిన ఏర్పడిన ప్రభుత్వం చర్యలు తీసుకుంది. నీళ్లు, నిధులు, నియమాకాలపై కేసీఆర్ ప్రభుత్వం దృష్టి సారించింది.
కొత్త రాష్ట్రం ఏర్పాటు తర్వాత ప్రభుత్వం నీళ్లు, నిధుల విషయంలో ప్రభుత్వం చురుగ్గానే వ్యవహరించింది. తెలంగాణకు సంబంధించిన నిధులను.. రాష్ట ఆదాయన్ని.. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం, తెలంగాణ ప్రజల కోసం ఖర్చు చేస్తుంది. ఇక నీళ్ల విషయానికి వస్తే.. రాష్ట్ర అవతరణ తర్వాత ప్రజల సాగు, తాగు నీటి అవసరాలు తీర్చడం కోసం ప్రభుత్వం భారీ ఎత్తున ప్రాజెక్ట్‌ల నిర్మాణం చేపట్టింది. కాళేశ్వరం, పాలమూరు-రంగారెడ్డి, డిండి ప్రాజెక్ట్ ల నిర్మాణం చేపట్టి.. ఆకుపచ్చ తెలంగాణ కల సాకారం దిశగా అడుగులు వేస్తోంది. నూతన రాష్ట్రం ఏర్పాటు తర్వాత పలు ప్రాజెక్ట్‌లకు శంఖుస్థాపన చేయడమే.. కాక వాటిని త్వరితగతిన పూర్తి చేసేందుకు కృషి చేస్తోంది.
నియమాకాల విషయంలో జాప్యం..
ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటులో యువత పాత్ర ఎంతో కీలకం. ఉమ్మడి రాష్ట్రంలో ఉద్యోగాల విషయంలో నష్టపోతున్నాం.. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే.. తెలంగాణ ఉద్యోగాలు తెలంగాణ వారికే దక్కుతాయని భావించి.. ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. వారి ఆశలకు తగ్గట్టుగానే ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైన తర్వాత ప్రభుత్వం ఒకేసారి భారీ ఎత్తున నోటిఫికేషన్లు విడుదల చేసింది. ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్లో ఇప్పటివరకు దాదాపు 30 వేల ఉద్యోగాలు భర్తీ చేశారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పటి వరకు లక్షా 30 వేల ఉద్యోగాలను భర్తీ చేసినట్లు ప్రకటించింది.
ప్రతిపక్షాలకు భారీ షాక్..
ఇక 2018 ఎన్నికల తర్వాత నుంచి రాష్ట్రంలో ఉద్యోగ నియమాకాలు జరగలేదు. ఓవైపు రాష్ట్రవ్యాప్తంగా లక్ష ఉద్యోగాలు ఖాళీ ఉన్నట్లు విపక్షాలు చెబుతుండగా.. ప్రభుత్వం మాత్రం వాటి భర్తీకి ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో నిరుద్యోగుల్లో అసంతృప్తి పెరుగుతూ వచ్చింది. ఆ ప్రభావం జీహెచ్ఎంసీ ఎన్నికలు, పలు ఉప ఎన్నికల్లో స్పష్టంగా కనిపించింది. విపక్షాలకు నిరుద్యోగ సమస్య గొప్ప అస్త్రంగా మారింది. ప్రభుత్వం నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటుందని.. ఉద్యోగాలు భర్తీ చేయకుండా.. వారిని ఆత్మహత్యకు పురి గొల్పుతుందని ప్రభుత్వంపై విమర్శలు చేయసాగింది. నిరుద్యోగుల విషయంలో ప్రభుత్వాన్ని ఇరుకున పెడదామని భావిస్తోన్న విపక్షాలకు కేసీఆర్ భారీ షాక్ ఇచ్చారు.
ఇది కూడా చదవండి : రంగంలోకి పీకే టీం.. సీఎం కేసీఆర్ తో మంతనాలు
2022 తెలంగాణ బడ్జెట్ సమావేశాల సందర్భంగా అసెంబ్లీ వేదికగా కేసీఆర్ 91 వేల ఉద్యోగాల భర్తీకి అంగీకారం తెలిపాడు. ఇంత భారీ ఎత్తున నోటిఫికేషన్ విడుదల అవుతుండటం పట్ల తెలంగాణ నిరుద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయతే ఏడాదిన్నరగా.. ఉద్యోగాల భర్తీపై రాష్ట్రవ్యాప్తంగా విపక్షాలు, నిరుద్యోగులు ఆందోళనలు చేసినా.. పట్టించుకోని ప్రభుత్వం.. ఉన్నట్లుండి.. ఇప్పుడు భారీగా నోటిషికేషన్ విడుదల చేయడం వెనక కేసీఆర్ రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయి అంటున్నారు విశ్లేషకులు.
ముందస్తు ఎన్నికలు…
త్వరలోనే కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్తారని.. ఈ క్రమంలో ప్రభుత్వంపై అసంతృప్తిగా ఉన్న నిరుద్యోగులను తనవైపు తిప్పుకోవడమే కాక.. విపక్షాలకు ప్రభుత్వాన్ని వేలెత్తి చూపే అవకాశం ఇవ్వకూడదని భావించే.. కేసీఆర్ ఈ అనూహ్య నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు విశ్లేషకులు. 91 వేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసి.. విపక్షాలను కోలుకోలేని విధంగా దెబ్బ తీశారని అంటున్నారు. అంతేకాక రాజకీయ ఎత్తుగడలు వేయడం, వ్యూహ రచన చేయడంలో కేసీఆర్ ను అంచనా వేయడం ఎవరి తరం కాదని.. ఆయన వ్యూహాలు ఎవరికి అందవంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఏది ఏమైనా నోటిఫికేషన్ జారీతో కేసీఆర్ ఒక్క బుల్లెట్ తో రెండు టార్గెట్లను ఒకేసారి రీచ్ అయ్యారని.. నిరుద్యోగుల్లో సానుకూల అభిప్రాయం కలగజేయడమే కాక.. విపక్షాలను దెబ్బ తీశారు అంటున్నారు విశ్లేషకులు. కేసీఆర్ వ్యూహ రచనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.