SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » politics » Etela Rajender Resignation To Trs Party

బిగ్ బ్రేకింగ్! ఈటల రాజేందర్ రాజీనామా!

  • Written By: Raj Mohan Reddy
  • Updated On - Fri - 4 June 21
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
బిగ్ బ్రేకింగ్! ఈటల రాజేందర్ రాజీనామా!

అనుకున్నదే అయ్యింది. ఊహించిందే జరిగింది. అసైన్డ్ భూముల వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈటల రాజేందర్ టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వానికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఢిల్లీ పర్యటన తరువాత హైదరాబాద్ చేరుకున్న ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేసి తన రాజీనామా విషయాన్ని తెలియచేశారు. కాగా.., ఈ సమయంలో ఆయన తనని మంత్రి వర్గం నుండి బర్తరఫ్ చేసిన విధానంపై ఎమోషనల్ గా స్పందించారు. తెలంగాణ ఆత్మగౌరవం అన్న నినాదంతోనే ఇన్నాళ్లు పోరాటం చేశాను, రాజకీయాలు చేశాను. పార్టీ కోసం ఎన్నో ఇబ్బందులు పడ్డాను. బాధలను సహించాను. 19 సంవత్సరాలుగా ఏ తప్పు చేయని రాజేందర్.. ఓ తప్పు చేశారని కేసీఆర్ రాత్రికి రాత్రి ఎలా నిర్ధారించుకోగలిగారు? ఓ అనామకుడు ఉత్తరం రాస్తే మంత్రిపై చర్యలు తీసుకుంటారా? అసలు ఏమైందో తెలుసుకోకుండానే నాపై చర్యలకి ఆదేశిస్తారా? మీ కుటుంబానికి బంగారు పళ్లెంలో పెట్టి అన్ని రకాల పదవులు ఇచ్చాం. ఇంకా ఏం ఇవ్వాలని తెలంగాణ బిడ్డల ఆత్మ గౌరవంపై దెబ్బ కొడుతున్నారని ఈటల తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

అప్పటి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి అసెంబ్లీలో నన్ను అవహేళన చేశారు. పట్టుమని పది సీట్లు గెలవలేదని విమర్శించారు. తెలంగాణ ఆత్మగౌరవం మీద దెబ్బకొట్టాలని చూసిన ప్రతిసారి రాజీనామా చేసి ప్రజల్లోకి వెళ్లాను. గెలిచి చూపించాను. ఇలా ఏనాడైనా రాజేందర్ పదవుల కోసం ఆశ పడ్డాడా? ఆస్తులు సంపాదించుకోవాలని ఎగబడ్డాడా? ఇవన్నీ కూడా కేసీఆర్ కి తెలుసు. కానీ.., ఈరోజు తన కుటుంబ ప్రయోజనాల కోసం నన్ను దూరం పెట్టాలని ఇలా చేశారని ఈటల తెలియచేశారు. ఇక సీఎంవో కార్యాలయం, మంతివర్గంపై కూడా ఈటల రాజేందర్ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2014లో తొలి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలి ముఖ్యమంత్రి ఎస్సీ అని చెప్పారు. కానీ.., ఇప్పటి మంత్రి వర్గంలో సీఎంవో కార్యాలయంలో ఎంత మంది ఎస్సీ, ఎస్టీ లు ఉన్నారని ఆయన గుర్తు చేశారు. తెలంగాణ కోసం కొట్లాడిన నేతలు, టీఎన్జీవోలను కూడా కేసీఆర్ కలవడానికి ఇష్టపడటం లేదని.., ఇన్నాళ్లు పార్టీ కోసమే ఈ అవమానాలు భరించామని ఆయన తెలియచేశారు. అయితే.., ప్రభుత్వ తీరుపై, కేసీఆర్ వ్యవహార శైలిపై ఇన్ని కామెంట్స్ చేసిన ఈటల.., తాను బీజేపీలో చేరే అంశంపై మాత్రం స్పందించలేదు. కానీ.., ఈ నెల 8 లేదా 9వ తేదీలలో ఆయన బీజేపీ కండువా కప్పుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరి.., ఈటల రాజేందర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి.

Join Our Whatsapp Channel

Tags :

  • etala
  • etala fire on cm kcr
  • etala fire on govt
  • etala join bjp
  • ETALA RAJENDAR
  • etela rajender resignation
Read Today's Latest politicsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

హుజూరాబాద్‌, బద్వేల్‌ ఉపఎన్నికకు షెడ్యూల్‌ విడుదల

హుజూరాబాద్‌, బద్వేల్‌ ఉపఎన్నికకు షెడ్యూల్‌ విడుదల

  • ఈటలకు షర్మిల ఆహ్వానం!

    ఈటలకు షర్మిల ఆహ్వానం!

  • ఈటల తరువాత కేసీఆర్ టార్గెట్  జగదీష్ రెడ్డేనా?

    ఈటల తరువాత కేసీఆర్ టార్గెట్ జగదీష్ రెడ్డేనా?

  • ఈటల రాజీనామాకి రంగం సిద్ధం! బీజేపీ అభ్యర్థిగా పోటీ!

    ఈటల రాజీనామాకి రంగం సిద్ధం! బీజేపీ అభ్యర్థిగా పోటీ!

  • ఈటల సిగ్గుంటే ఆ పని చెయ్ ! హద్దులు దాటిన ఈటల.. గంగుల వార్!

    ఈటల సిగ్గుంటే ఆ పని చెయ్ ! హద్దులు దాటిన ఈటల.. గంగుల వార్!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • ఇదే.. మన రాజ్యం..జనసేనలో చేరిన వంగవీటి రాధ

  • టాలీవుడ్‌ ఇన్నర్ వార్..! చష్మా, లూజ్ ప్యాంట్ వెనక అసలు కథ!

  • ఉరిశిక్షే సరైనది..బ్లూ డ్రమ్‌ హత్య కేసులో సంచలన తీర్పు

  • జయమ్ము నిశ్చయమ్మురా సీజన్ 2 వేదికపై సాయి పల్లవి

  • ఈసీ గుప్పిట్లోకి వెళ్లిపోయిన ఏపీ.. ఎన్నికల కోడ్ అమలు!

  • ఏపీలో మోగిన ఎలక్షన్ సైరన్.. స్థానికల ఎన్నికలకు నోటిఫికేషన్

  • మీ పిల్లల పేరుతో లక్షల సంపద.. మైనర్ డీమ్యాట్ అకౌంట్ గురించి తెలుసా?

Most viewed

  • కేబీఆర్ పార్క్ రోడ్డు విస్తరణ.. 862.77 గజాల స్థలం ఇచ్చేందుకు బాలకృష్ణ అంగీకారం

  • నానా పటేకర్ మృతి ఘటనలో కీలక ట్విస్ట్.. అసహజ మరణంగా కేసు నమోదు

  • ఏపీకి వస్తున్న సీఎం విజయ్.. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌తో భేటీ ఎందుకంటే?

  • రూ.50 వేల కోట్లతో 2,000 ఎకరాల్లో టెక్స్‌టైల్ పార్క్? కిటెక్స్‌తో లోకేశ్ చర్చలు

  • జైలర్ 2 టికెట్ ధరల పెంపునకు ఏపీ ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

  • తమ్ముడి పాలనపై అన్నయ్య ‘మెగా’ మార్కులు.. పవన్ కల్యాణ్‌పై చిరంజీవి ప్రశంసలు

  • ఏపీలో మోగిన ఎలక్షన్ సైరన్.. స్థానికల ఎన్నికలకు నోటిఫికేషన్

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam