ప్రస్తుతం రాష్ట్రంలో కేసీఆర్ వర్సెస్ బీజేపీ అన్న రేంజ్ లో మాటల యుద్ధం కొనసాగుతోంది. ప్రధాని నరేంద్ర మోదీ సమతామూర్తి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చారు. కానీ కేసీఆర్ మాత్రం అస్వస్థ కారణం చెప్పి.. మోదీని స్వాగతించడానికి వెళ్లలేదు. ఆ తర్వాత కేసీఆర్.. చేసిన ట్వీట్ రాష్ట్రంలో పెను దుమారం రేపింది. ఈ క్రమంలో ఇటు టీఆర్‌ఎస్ శ్రేణలు, అటు బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. ఈ క్రమంలో ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై సీపీఐ నేత నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఇది కూడా చదవండి: సీఎం కేసీఆర్ పై ఏపీ మంత్రి సంచలన వ్యాఖ్యలు..!
కేసీఆర్ అంత నమ్మదగిన వ్యక్తి కాదని.. ప్రస్తుతం ఆయన విధానం జాతీయ స్థాయిలో బీజేపీ వ్యతిరేక ఓట్లను చీల్చే ఎత్తుగడ అని ఆరోపించారు. ఈ క్రమంలోనే ఎన్‌డీఏకు అనుకూలంగా ఉన్న ఏ రాష్ట్ర ముఖ్యమంత్రిని కూడా కేసీఆర్ కలవడం లేదన్నారు. ఓ వైపు ప్రధాని మోదీని వ్యతిరేకించినట్లే కనిపిస్తున్నా.. అదే సమయంలో మోదీకి నమ్మకమైన వ్యక్తిగా కూడా ఉండాలని కేసీఆర్ భావిస్తున్నట్లు వ్యాఖ్యానించారు. ఏబీఎన్ ఆర్కేకి ఇచ్చిన ఇంటర్వూలో కేసీఆర్ తీరును నారాయణ కడిగి పారేశారు.
ఇది కూడా చదవండి : జాతీయ రాజకీయాల్లోకి కేసీఆర్.. ఆ ఎన్నికల తర్వాత ప్రకటన
గతంలో తాము ఎన్నోసార్లు ఫోన్లు చేసినా ఎత్తని కేసీఆర్.. ఇప్పుడు తమపై సడెన్‌గా ప్రేమ చూపిస్తున్నారని నారాయణ ఎద్దేవా చేశారు. జాతీయ స్థాయిలో మూడో ఫ్రంట్ పెట్టడానికి సీపీఐ, సీపీఎం జాతీయ నాయకులను పిలిపించి మాట్లాడారని, బీజేపీ వ్యతిరేక వైఖరితో ఉండాలని ఆ సమావేశంలో అనుకున్నా కేసీఆర్‌ను నమ్మే పరిస్థితి లేదన్నారు.
బండి సంజయ్ తన ఆఫీసులో తలుపులు వేసుకుని దీక్ష చేస్తుంటే బయటకు లాక్కుని రావాల్సిన అవసరం ఏమొచ్చిందని నిలదీసిన నారాయణ.. బీజేపీతో కేసీఆర్ కావాలనే కెలుక్కున్నారని వ్యాఖ్యానించారు. ఓ వైపు బీజేపీని రెచ్చగొడుతూ.. మరోవైపు ఎంఐఎంని అడ్డం పెట్టుకుని ఎదగడానికి కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ సక్రమంగా ఉంటే దేశానికి ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదన్నారు. ఎలాగోలా కాంగ్రెస్ పార్టీతో ముందుకెళ్లి బీజేపీ నుంచి దేశాన్ని రక్షించుకోవాలన్నది సీపీఐ ఆలోచన అని తెలిపారు. అయితే సీపీఎం మాత్రం కాంగ్రెస్, బీజేపీ వ్యతిరేక వైఖరితో ఉందని పేర్కొన్నారు. నారాయణ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.