SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » politics » Chandrababu Naidu And Ganta Srinivasarao Meeting At Hyderabad

గంటా శ్రీనివాసరావు కోసం దిగొచ్చిన చంద్రబాబు!

  • Written By: Dharani
  • Updated On - Fri - 18 February 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
గంటా శ్రీనివాసరావు కోసం దిగొచ్చిన చంద్రబాబు!

ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అటు అధికార పక్షంలోను, ఇటు విపక్షంలోనూ కీలక నేతల మధ్య అంతర్గత కుమ్ములాటలు, అధిప్యత పోరు ఎలా సాగుతుందో చూస్తూనే ఉన్నాం. నాయకులు వ్యక్తిగత ఈగోలు పార్టీలకు ప్రమాదంగా మారాయి. ఇక గత అసెంబ్లీ ఎన్నికల్లో ఏపీలో టీడీపీ ఘోర పరాజయం పాలైన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆ పార్టీకి చెందిన చాలామంది కీలక నేతలు రాజకీయాలకు దూరంగా.. నియోజకవర్గాలకే పరిమితమయ్యారు.

ఉత్తరాంధ్రలో టీడీపీ కీలక నేత గంటా శ్రీనవివాసరావు పరిస్థితి కూడా ఇలానే ఉంది. 2019 ఎన్నికల ఫలితాల తర్వాత నుంచి గంటా పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉంటున్నారు. పార్టీకి సంబంధించిన ఎలాంటి కార్యక్రమాల్లో ఆయన పాల్గొనడం లేదు. తన నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు, సమస్యలను పరిష్కారం చేయడానికే గంటా పరిమితమవుతున్నారు. ఈ క్రమంలో నేడు చంద్రబాబు నాయుడు-గంటా శ్రీనివాస్‌ రావు మధ్య కీలక భేటీ జరగనుంది. దీనిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

ఇది కూడా చదవండి : 2024 ఎన్నికల్లో కొడాలి నాని ఓటమికి చంద్రబాబు మాస్టర్ ప్లాన్!

ఎన్నికల తర్వాత నుంచి పార్టీకి దూరం..

2019 అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత గంటా పూర్తిగా సైలెంట్‌ అయ్యారు. పార్టీ కార్యక్రమాల్లో ఎక్కడా కనిపించలేదు. ఆఖరికి చంద్రబాబు 36 గంటల దీక్ష చేసినప్పడు కూడా అటు వైపు చూడలేదు. అయితే ఆయన కావాలనే పార్టీకి దూరంగా ఉన్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ మూడేళ్ల కాలంలో చంద్రబాబు కూడా గంటా శ్రీనివాసరావు విషయాన్ని సీరియస్‌ గా తీసుకోలేదని కార్యకర్తలు భావిస్తున్నారు. అయితే గత కొంతకాలంగా గంటా తీరు చూస్తే.. భవిష్యత్తులో పెద్ద ముప్పు వాటిల్లే అవకాశం ఉందని భావించిన చంద్రబాబు తిరిగి ఆయనను పార్టీలో యాక్టీవ్‌ గా పని చేసేలా చూడాలని భావిస్తున్నారట.

Ganta Sreenivas Rao and Chandrababu Naidu Issue

కాపు సామాజిక వర్గాన్ని ఏకం చేస్తున్న గంటా..

ఏపీ రాజకీయాల్లో కాపు, కమ్మ సామాజిక వర్గాలకు అత్యంత ప్రాధాన్యత ఉంది. వీరి మద్దతు ఎవరికి ఉంటే.. వారిదే అధికారం అన్నట్లుగా ఉంటుంది పరిస్థితి. రాష్ట్రంలో 19 శాతం వరకు ఉన్న కాపుల మద్దతు ఎవరికి దక్కితే.. వారు అధికారంలోకి రావడానికి మార్గం సుగమం అవుతుంది. ప్రస్తుతం ఏపీలో కాపు సామాజిక వర్గంలో ముఖ్యనేతలు ఎవరు టీడీపీకి పెద్దగా మద్దతు ఇవ్వడం లేదు. వంగవీటి రంగా తనయుడు వంగవీటి రాధాకృష్ణ పూర్తిగా టీడీపీకే మద్దతు ఇస్తాడా అంటే.. కచ్చితంగా చెప్పలేం. ఇక మరో నేత ముద్రగడ పద్మనాభం.. టీడీపీకి దూరం అయ్యారు. ఇక జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ కాపు సామాజిక వర్గానికి చెందినప్పటికి.. ఆయన స్వయంగా పార్టీ స్థాపించారు. కనుక ఈ విషయంలో ఆ‍యన టీడీపీతో కలిసి వస్తారంటే.. డౌటే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇలాంటి సమయంలో కాపు సామాజిక వర్గానికి చెందిన గంటాను దూరం చేసుకుంటే.. టీడీపీకి మరింత నష్టం అంటున్నారు విశ్లేషకులు.

ఇది కూడా చదవండి : చంద్రబాబు మౌనం దేనికి సంకేతం? టీడీపీలో ఏమి జరుగుతోంది?

ప్రస్తుత భేటీ అందుకే..

ప్రస్తుతం పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్న గంటా.. రాష్ట్ర కాపు సామాజికవర్గం నేతలను ఏకం చేసే ప్రయత్నం చేస్తున్నారు. కాపులకు అధికారం దక్కాలని ఆయన సమాలోచనలు జరుపుతున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే కొన్ని రోజుల క్రితం హైదరాబాద్ లో రాజకీయాలలో కీలకంగా ఉన్న కాపు నేతలు సమావేశమయ్యారు. ఈ భేటీకి గంటాతో పాటు.. అన్ని పార్టీలకు చెందిన కాపు నేతలు హాజరయ్యారు. సమావేశంలో భవిష్యత్‌ కార్యాచరణపై చర్చించారు. ప్రస్తుతం గంటా కాపు నేతలను ఏకం చేసే పనిలో పడ్డారని సమాచారం. దీని గురించి చంద్రబాబుకు ఎప్పటికప్పుడు రిపోర్ట్‌ చేరుతుందట.

ఈ క్రమంలో కాపు సామాజికవర్గంలో కీలకంగా ఉన్న గంటా శ్రీనివాసరావు పార్టీకి దూరం కాకుండా ఉండేలా చూడాలని ఇప్పటికే చంద్రబాబు నిర్ణయించుకున్నారని తెలుస్తోంది. అందుకే ఆయనతో భేటీకి సిద్ధం అయ్యారని సమాచారం. గంటా శ్రీనివాసరావుతో పాటు ఉత్తరాంధ్రలోని మిగిలిన ఎమ్మెల్యేలు కూడా ఈ సమావేశానికి హాజరు కానున్నారు. ఎమ్మెల్యేలతో పాటు పార్టీ కీలక నేతలను కూడా చంద్రబాబు సమావేశానికి పిలిచారు. దీనిపై మీ అభిప్రాయాలను కామెం‍ట్స్‌ రూపంలో తెలియజేయండి.

Tags :

  • Andhra Pradesh
  • Chandrababu Naidu
  • Ganta Srinivasa Rao
  • political news
  • tdp
Read Today's Latest politicsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • కృష్ణా ఎక్స్ ప్రెస్ రైలులో పొగలు.. పరుగులు తీసిన జనం..!

    కృష్ణా ఎక్స్ ప్రెస్ రైలులో పొగలు.. పరుగులు తీసిన జనం..!

  • బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఈ జిల్లాల్లో ఐదు రోజుల పాటు వానలే!

    బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఈ జిల్లాల్లో ఐదు రోజుల పాటు వానలే!

  • భార్య మరణాన్ని జీర్ణించుకోలేకపోయాడు.. ఆమె రూపాన్ని ప్రాణ ప్రతిష్ట చేయించాడు

    భార్య మరణాన్ని జీర్ణించుకోలేకపోయాడు.. ఆమె రూపాన్ని ప్రాణ ప్రతిష్ట చేయించాడు

  • విజయవాడ: టీవీఎస్ షోరూంలో భారీ అగ్ని ప్రమాదం.. 300 వాహనాలు దగ్ధం

    విజయవాడ: టీవీఎస్ షోరూంలో భారీ అగ్ని ప్రమాదం.. 300 వాహనాలు దగ్ధం

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

  • Praggnanandhaa: ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్ రన్నరప్ గా ప్రజ్ఞానంద..ఆనంద్ మహేంద్ర ట్వీట్ వైరల్

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam