టాలీవుడ్‌లో నటుడిగా, నిర్మాతగా అందిరికి పరిచయం అక్కర్లేని పేరు బండ్ల గణేష్. తెలుగు చిత్ర పరిశ్రమలో నిర్మాతగానూ ఆయన ఓ మెట్టు ఎక్కి బడా ప్రొడ్యూసర్ జాబితాలో చేరిపోయాడు. పవన్ కళ్యాణ్ హీరోగా గబ్బర్‌సింగ్ అనే సినిమాతో నిర్మాతగా సెన్సేషనల్ హిట్ అందుకున్నాడు ఈ బడా ప్రొడ్యూసర్. ఈ దెబ్బతో బండ్ల గణేష్ క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. పైగా ఆయన ఇప్పుడు సినిమాల్లో నటిస్తూనే నిర్మాణ బాధ్యతలు మోస్తున్నారు.
కాగా ఇటీవల క్రేజీ అంకుల్స్ అనే సినిమాల్లో కూడా నటించారు బండ్ల గణేష్. దీంతో సినిమాలతో పాటు సమకాలీన అంశాలపై అప్పడప్పుడు ట్విట్టర్‌లో స్పందిస్తూ కాంట్రవర్సీ అవుతు ఉంటాడు. అయితే గతంలో బండ్ల గణేష్ కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. అప్పట్లో.. పవన్ కళ్యాణ్‌ను అంతగా అభిమానించే బండ్ల గణేష్ జనసేన పార్టీలో ఎందుకు చేరలేదు? చేరకపోవటం వెనక ఏమైన కారణాలు ఉన్నాయా? అంటూ ఇలా అనేక రకాల ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయి.
తాజాగా ఇలాంటి ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు నిర్మాత బండ్ల గణేష్. నాకు కాంగ్రెస్ పార్టీ అంటే చిన్నప్పటి నుంచి ఎంతో అభిమానమని, తల్లితండ్రిలాంటిదని దీని కారణంగానే నేను కాంగ్రెస్ పార్టీలో చేరానని తెలిపారు. ఇక పవన్ కళ్యాణ్ అంటే నాకు కృతజ్ఞతా భావమని ఆయన అన్నారు. ఇక దీంతో పాటు ఏపీ మంత్రి బొత్స సత్యానారాయణ తనకు స్నేహితుడులాంటివాడని, దీంతో ఆయన వెంట తిరుగుతుంటే అందరూ ఆయన బినామిగా ముద్రవేశారని తెలిపారు. ఇక ప్రకాష్ రాజ్ గురుంచి కూడా స్పందించారు బండ్ల గణేష్. ఆయనపై ఉన్న నమ్మకంతోనే మా ఎన్నికల్లో ప్రకాష్ రాజ్‌కు మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు.