ఏపీ అసెంబ్లీ సమావేశాలు వాడీవేడిగా సాగుతున్నాయి. ప్రతి రోజు సమావేశాలు ప్రారంభం కావడం.. టీడీపీ సభ్యులు ఇష్టారీతిన ప్రవర్తించడం.. స్పీకర్ వారిపై సస్పెన్షన్ వేటు వేయడం పరిపాటి అయ్యింది. ఇక నేటి సమావేశంలో టీడీపీ సభ్యులు అన్ని హద్దులు దాటి ప్రవర్తించారు. ఏకంగా అసెంబ్లీలో చిడతలు వాయించి.. తమ నిరసన తెలిపారు. టీడీపీ సభ్యుల తీరుపై స్పీకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ వివరాలు.. బుధవారం ఉదయం సభ ప్రారంభం కాగానే ప్రశ్నోత్తరాల కార్యక్రమం చేపట్టగా.. వైసీపీ ఎమ్మెల్యే విడదల రజనీ మాట్లాడబోతున్న సమయంలో టీడీపీ సభ్యులు ఆమె ప్రసంగాన్ని అడ్డుకోవడానికి చిడతలు కొడుతూ భజన చేశారు.
ఇది కూడా చదవండి: అండమాన్ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా అచ్చెన్నాయుడు!
ఈ క్రమంలో టీడీపీ సభ్యుల తీరుపై స్పీకర్ తమ్మినేని సీతారాం ఆగ్రహం వ్యక్తం చేశారు. సభలో ఈ విధంగా ప్రవర్తించడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు ‘మీరు’ శాసనసభ్యులేనా అంటూ మండిపడ్డారు. ఎమ్మెల్యేల తీరు సరికాదని వెళ్లి వారి స్థానాల్లో కూర్చోవాలని సూచించారు. టీడీపీ ఎమ్మెల్యేలు వెనక్కు తగ్గకపోవడంతో ఐదుగుర్ని స్పీకర్ సస్పెండ్ చేశారు. అలాగే ఎమ్మెల్యేల తీరును ఎథిక్స్ కమిటీ దృష్టికి తీసుకెళ్లారు.
ఇది కూడా చదవండి: టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు హౌస్ అరెస్ట్.. ఇంటి చుట్టూ పోలీసులు!
ఎన్నికల తర్వాత టీడీపీ నేతలంతా చిడతలు వాయించుకోవాల్సిందేని ఎమ్మెల్యే అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు. నిన్న విజిల్స్ వేశారు, ఇవాళ చిడతలు వాయించారు రేపు సభలో ఏం చేస్తారో అని విమర్శించారు. సభలో అమర్యాదగా ప్రవర్తించిన టీడీపీ సభ్యుల్ని సస్పెండ్ చేయాలని స్పీకర్ను కోరారు. చంద్రబాబు అల్జీమర్స్తో బాధపడుతున్నారని.. ఆ పార్టీ ఎమ్మెల్యేలు కూడా అసెంబ్లీలో ఇష్టం వచ్చినట్లు ప్రవరిస్తున్నారని అంబటి సెటైర్లు పేల్చారు. టీడీపీని ఎవరు పట్టుకుంటే వారు సర్వనాశనం అవుతారు.. తెలంగాణలో టీడీపీకి ఏ గతి పట్టిందో ఏపీలో అదే గతి పడుతుందని అంబటి జోస్యం చెప్పుకొచ్చారు.
ఇది కూడా చదవండి: వీడియో: పాదయాత్రలో YS షర్మిలపై తేనెటీగల దాడి
టీడీపీ సభ్యుల తీరుపై మంత్రులు, వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు సెటైర్లు పేల్చారు. చివరకు చంద్రబాబుకు చిడతలు కొట్టుకోవాల్సిందేనని.. వీరు సభకు తాగొస్తున్నారేమోననే అనుమానంగా ఉందని.. డ్రంకెన్ టెస్ట్ చేయాలని ఎమ్మెల్యే జక్కంపూడి రాజా సూచించారు. చంద్రబాబుకు చిడతలు కొట్టించుకోవడం బాగా అలవాటు అంటూ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఘాటు విమర్శలు చేశారు. ఆ అలవాటు వాళ్ళ ఎమ్మెల్యేలకు కూడా వచ్చిందని.. చిడతలతో సభలో అమర్యాదగా వ్యవహరిస్తున్నారన్నారు. ఇలానే చేస్తే తండ్రి కొడుకులు 2024 తర్వాత చిడతలు వాయించుకోవడమే మిగులుతుంది అన్నారు. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలయచేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.