న్యూ ఢిల్లీ- ఈ ఇంటర్నెట్ యుగంలోను మహిళల ఒంటరిగా బయటకు వెళ్లాలంటే భయపడిపోతున్నారు. సమాజంలో జరుగుతున్న ఘటనలే ఇందుకు కారణంగా చెప్పుకోవాలి. ప్రభుత్వాలు ఎన్ని కఠిన చట్టాలు తీసుకువచ్చినా కూడా మహిళలపై అఘాయిత్యాలు ఆగడం లేదు. ఇక తప్పక ఉద్యోగం కోసమో, మరే ఇతర అవసరం కోసమో బయటకు వెళ్లిన ఆడవాళ్లకు చాలా సందర్బాల్లో చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి.
ఐతే చాలా మంది మహిళలు తమకు ఎదురైన విపత్కర ఘటనలను మనకెందుకులే అని అక్కడే వదిలేస్తున్నారు. లేదంటే అనవసరంగా భాసుపాలవుతామని తాము ఎదుర్కొన్న సంఘటలను ఎవ్వరికి చెప్పడం లేదు. కానీ ఢిల్లీలో తవకు ఎదురైన ఆటో ప్రయాణానికి సంబందించిన చేదు అనుభవం గురించి అందరికి చెప్పి, అలాంటి వారితో జాగ్రత్తగా ఉండాలని అప్రమత్తం చేసింది. ఓ ఆటోడ్రైవర్‌తో తనకు ఎదురైన చేదు అనుభవాన్ని ట్విటర్ ద్వార అందరితో పంచుకుంది. ఆమె ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
హర్యానా రాష్ట్రానికి చెందిన యువతి నిష్తా పలివాల్ ఢిల్లీలో కమ్యూనికేషన్స్ స్పెషలిస్ట్‌గా పని చేస్తోంది. డిసెంబర్ 19న మధ్యాహ్నం 12గంటల సమయంలో గుర్గావ్ సెక్టార్ 22లోని బిజీ మార్కెట్ లోని ఆటోస్టాండ్ లోని ఓ ఆటో దగ్గరికి వెళ్లింది. ఆ ఆటో డ్రైవర్ డివోషనల్ సాంగ్స్ మీడియం వాల్యూమ్ లో పెట్టుకుని వింటున్నాడు. అతని వాలకం చూస్తే ఆ యువతికి ఏ మాత్రం అనుమానం రాలేదు. తన దగ్గర నగదు లేదని, పేటీఎం ద్వార ఆటో చార్జి చెల్లిస్తానని చెప్పడంతో ఆటో డ్రైవర్ సరేనని ఆమెను ఆటోలో ఎక్కించుకున్నాడు.
అక్కడి నుంచి కేవలం ఏడు నిమిషాల్లో ఆ యువతి ఇంటికి చేరాలి. ఐతే వెళ్లాల్సిన రోడ్డులో కాకుండా, మరో రోడ్డులో అతను టర్న్ తీసుకున్నాడు. ఎందుకు ఈ దారిలో వెళ్తున్నావని ప్రస్నించినా అతను వేగంగా ఆటో నడుపుకుంటూ వెళ్తున్నాడు. మళ్లీ మళ్లీ అడగడంతో ఆటో డ్రైవర్ బిగ్గరగా దేవుడ్ని తల్చుకున్నాడు. అతని చేష్టలతో భయపడిన యువతి, ఆచో ఆపమని పదే పదే చెప్పింది. అయినా ఆటో డ్రైవర్ నుంచి స్పందన లేదు. దీంతో ఆమెకు ఒకటే మార్గం కనిపించిందట. వేగంగా వెళ్తున్న ఆటో నుంచి బయటకు దూకితే కాళ్లు, చేతులు విరుగుతాయి.
కానీ ఆ మృగం చేతిలో పడితే మానంతో పాటు ప్రాణం కూడా పోవచ్చవి ఆలోచించింది. అంతే ఏ మాత్రం ఆలోచించకుండా ఆటోలోంచి కిందకు దూకేసింది. ఐతే ఆ డ్రైవర్ మాత్రం వెనక్కి కూడా తిరిగి చూడకుండా అలాగే ముందుకు వెళ్లిపోయాడు. చిన్న చిన్న గాయాలతో ఆ యువతి సురక్షితంగా బయటపడింది. ఇలాంటి ఘటనల పట్ల అప్రమత్తాంగా ఉండాలని తాను ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వార చెబుతున్నానని యువతి చెప్పుకొచ్చింది. ఈ ఘటన పోలీసుల దృష్టికి వెళ్లడంతో ఆటో డ్రైవర్‌ను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
Yesterday was one of the scariest days of my life as I think I was almost abducted/ kidnapped. I don’t know what it was, it’s still giving me chills. Arnd 12:30 pm, I took an auto from the auto stand of a busy market Sec 22 (#Gurgaon) for my home which is like 7 mins away (1/8)
— Nishtha (@nishtha_paliwal) December 20, 2021