అనుమానం పెనుభూతం.. అది ఉన్న వ్యక్తులు జీవిత భాగస్వామికి లేదా కుటుంబ సభ్యులకు నరకం చూపిస్తారు. వారు ప్రశాంతగా ఉండకుండా..తన వారిని హింసిస్తుంటారు. అలా అనుమానం పెరిగి చివరికి హత్య చేయడానికి కూడా ప్రేరేపిస్తుంది. తాజాగా ఓ వ్యక్తి.. తన భార్య పో*ర్న్ మూవీలో నటించిందని అనుమానించి..కత్తితో పోడి చంపేశాడు. ఈ దారుణ ఘటన బెంగళూరులో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..
కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరులో జహీర్ పాషా అనే వ్యక్తి ఆటో డ్రైవర్ గా జీవనం సాగిస్తున్నాడు. అతడిని పో*ర్న్ వీడియోలు చూసే అలవాటు ఉంది. ఈ క్రమంలో రెండు నెలల క్రితం మొబైల్ లో పో*ర్న్ చిత్రాలను చూశాడు. అందులోని ఓ వీడియోలో ఉన్న మహిళ తన భార్యేనన్న అనుమానం కలిగింది. దీంతో అప్పటి నుంచి ఆమెను మానసికంగా, శారీరకంగా వేధించడం మొదలు పెట్టాడు. వీరికి వివాహమై 15 ఏళ్లు అయింది. వీరికి ఐదుగురు సంతానం ఉంది. అందరూ కలిసే ఉంటున్నారు. ఈ క్రమంలో ఆ వీడియోలు చూసి భార్యపై అనుమానం పెంచుకుని ఆమెను కొడుతుండేవాడు. 20 రోజుల క్రితం తీవ్రంగా దాడి చేశాడు.
దీన్ని తట్టుకోలేకపోయిన బాధితురాలి తండ్రి పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేయబోగా ఆమె అడ్డుకుంది. తాజాగా ఆదివారం జహీర్ పాషా మరోసారి తన భార్యపై దాడి చేశాడు. కత్తితో ఆమెపై దాడికి తెగబడి.. తీవ్రంగా గాయపరిచాడు.అది చూసిన పాషా పెద్ద కుమారుడు తాత దగ్గరకు వెళ్లి చెప్పడంతో వారు పోలీసులను ఆశ్రయించారు. ఇంటికి వచ్చి చూసేసరికే ఆమె విగతజీవిగా పడి ఉంది. అనుమానంతో ఓ నిండు జీవితాన్ని బలి తీసుకున్న ఇలాంటి మృగాలకు ఉరితీయాలని స్థానికులు కోరారు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.