వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చేపట్టిన ప్రజా ప్రస్థాన పాదయాత్రలో ఉద్రిక్తత నెలకొంది. టీఆర్‌ఎస్ శ్రేణులు ఆమెను అడ్డుకోవడమే కాక.. చెప్పులు కూడా విసిరారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఆ వివరాలు.. వైఎస్ షర్మిల చేపట్టిన ప్రజా ప్రస్థాన పాదయాత్ర 41వ రోజు కార్యక్రమం బుధవారం సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం, నాగారం మండలంలో నిర్వహించారు. మంత్రి జగదీశ్‌రెడ్డి స్వగ్రామమైన నాగారంలో ఎలాంటి సమస్య లేవని.. కావున మంత్రిని, ఎమ్మెల్యేని గాదరి కిశోర్‌ను విమర్శించొద్దని టీఆర్‌ఎస్ శ్రేణులు డిమాండ్ చేశాయి.
ఇది కూడా చదవండి: షర్మిళ తొందరపడింది! జగన్ ముందు ఎవ్వరూ నిలబడలేరు: వైఎస్ చెల్లెలు
ఈ క్రమంలో తమ సభకు ఎందుకు రక్షణ కల్పించడం లేదంటూ వైఎస్సార్‌టీపీ నేతలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఒకవైపు ఘర్షణఒకవైపు ఘర్షణ జరుగుతుండగానే మరోవైపు షర్మిల ప్రసంగించారు. తాను సీఎం నియోజకవర్గం గజ్వేల్‌లోనూ సభ నిర్వహించానని, అక్కడ లేనిది ఇక్కడ ఎందుకింత దౌర్జన్యమని మండిపడ్డారు. స్థానిక సమస్యలపై మంత్రి జగదీశ్‌రెడ్డి, ఎమ్మెల్యే కిశోర్‌ల కాలర్ పట్టి నిలదీయండంటూ పిలుపునిచ్చారు. షర్మిల వ్యాఖ్యలతో తీవ్ర ఆగ్రహానికి గురైన టీఆర్‌ఎస్ కార్యకర్తలు ఆమెపైకి చెప్పులు విసిరారు. ‘షర్మిల గోబ్యాక్’ అంటూ వారు నినాదాలు చేశారు.
ఇది కూడా చదవండి: ఏపీలోనూ వై.ఎస్. షర్మిల పార్టీ! జగన్ పై ఉండవల్లి మాస్టర్ ప్లాన్!
దీంతో వైఎస్సార్‌టీపీ కార్యకర్తలు ప్రతినినాదాలు చేశారు. ఇరువర్గాల మద్య తోపులాట జరిగింది. ఉద్రిక్త పరిస్థితి ఏర్పడటంతో పోలీసులు జోక్యం చేసుకున్నారు. టీఆర్‌ఎస్ నేతలు, కార్యకర్తలను అక్కడి నుంచి పంపించారు. ఆ తర్వాత సభ సజావుగా కొనసాగింది. ఈ నేపథ్యంలోనే తమపై దాడి చేసిన స్థానిక టీఆర్ఎస్ లీడర్ చిప్పలపల్లి సోమయ్యపై వైఎస్సార్‌టీపీ నాయకులు నాగారం పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: యువతి అరెస్టుపై.. సీఐకి ఫోన్ చేసి నిలదీశిన వైఎస్ షర్మిల!.. వీడియో వైరల్