తమ్ముడి మరణం తట్టుకోలేక గుండెలవిసేలా విలపించిన ఓ అక్క అతడి మృతదేహం వద్ద రోదిస్తూ గుండెపోటుతో మృతిచెందింది. అక్కకు తమ్ముడి పై ఉన్న ప్రేమ ఎంత గొప్పదో అన్న విషయం ఈ సంఘటన రుజువు చేసింది. ఈ విషాద ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా జరిగింది. గుడిమల్కాపురం గ్రామానికి చెందిన సయ్యద్ షరీఫ్ అనే యువకుడు రోడ్డు పై చిన్న పంక్చర్ షాప్ పెట్టుకొని బతుకుతున్నాడు. బైక్ పై ఒక చిన్న మీద గుడి మల్కాపూర్ కి వెళ్లి వస్తున్న సమంలో అదుపు తప్పి పడిపోయాడు.. దాంతో తలకు తీవ్ర గాయం అయ్యింది.
స్థానికులు గమనించి షరీఫ్ ని హైదరాబాద్ లోని గాంధీ హాస్పిటల్ కి తరలించి చికిత్స చేస్తున్న సమయంలో చనిపోయాడు. షరీఫ్ చనిపోయిన విషయం తెలుసుకొని కుటుంబ సభ్యులు కన్నీటి సంద్రంలో మునిగిపోయారు. అతని బాబాయి కూతురు షేక్ ఖాదర్‌బీ అంత్యక్రియలకు హాజరైంది.
చిన్నప్పటి నుంచి కలిసి తిరిగి తమ్ముడు నిర్జీవంగా ఉండటం చూసి అతనిపై పడి బోరున విలపించింది. అదే సమయంలో గుండె పోటుకు గురై అక్కడికక్కడే మృతి చెందారు. షేక్ ఖాదర్‌బీకి భర్త, ఒక కుమారుడు, కూతురు ఉన్నారు. ఒకేసారి రెండు విషాద ఘటనలు చోటు చేసుకోవడంతో కుటుంబ సభ్యులే కాదు.. గ్రామస్థులు కన్నీటి పర్యంతం అయ్యారు.