పెళ్లైన కొంత కాలానికి పిల్లలు పుట్టకపోతే.. ఆ దంపతులు ఎంతగా ఆవేదన చెందుతారో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఈ క్రమంలో తెలిసిన వారి పిల్లలను లేదా అనాధాశ్రమంలో పిల్లలను తెచ్చుకొని దత్తత తీసుకుంటారు. దత్తత తీసుకున్న తర్వాత ఆ పిల్లలను తమ కంటికి రెప్పలా చూసుకుంటారు. ఆర్థిక ఇబ్బందులతో కొంత మంది తమకు పుట్టిన పిల్లలను వెంటనే కొంతమందికి దత్తత ఇస్తుంటారు. అలా తాము దత్తత తీసుకున్న పిల్లలపై ఎంతగానో మకకారం పెంచుకుంటారు.
ఇద్దరు తల్లులు ఒక పసిబిడ్డ కోసం పెద్ద గొడవ పడ్డారు. ఒకరిది కన్న బంధం.. మరొకరిది పెంచిన బంధం.. ఒక పసిబిడ్డ కోసం ఇద్దరు తల్లులు పంచాయతీ పెట్టుకున్నారు. నా కొడుకు అంటే లేదు నా కొడుకు అంటూ వాదులాడుకోవడంతో.. పోలీసులు రంగంలోకి దిగారు, ఐసీడీఎస్ అధికారులు పసికందును తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఈ ఘటన నిజామాబాద్ లో జరిగింది. వివరాల్లోకి వెళితే..
ఇది కూడా చదవండి: Breaking: షారుక్ ఖాన్ కు పోలీసుల నోటీసులు..!
నిజామాబాద్ కి చెందిన సునిత అనే మహిళకు పెళ్లైనా సంతానం కలగలేదు. దీంతో ఇరుగు పోరుగు చిన్న చూపు చూడటంతో తాను ఓ చిన్నారిని దత్తత తీసుకోవాలని ఆలోచించింది. ఈ క్రమంలో ఓ బాబు ని కొనుగోలు చేసింది. తమకు బాబు ని అప్పజెప్పిన మహిళలకు రూ.40 వేల రూపాయలు కూడా చెల్లింది. ఇలా బాబు పై ఎంతో ఆప్యాయత, అనురాగం పెంచుకున్నారు కొనుగోలు చేసిన తల్లిదండ్రులు. కానీ కన్న ప్రేమ చంపుకోలేక తన బాబును తనకు ఇచ్చేయాలని సునిత ఇంటి ముందు ఆందోళనకు దిగింది కన్నతల్లి ఇందిర.
తమకు సంతానం లేదని అందుకే బాబు ను ఇందిర వద్ద కొనుగోలు చేశామని.. ఆ సమయంలో ఆమె తల్లి కూడా సాక్ష్యంగా ఉందని.. అన్నింటికి అంగీకరిస్తూ తమ వద్ద రూ.40 వేలు తీసుకున్నారని అంటుంది సునిత. తమకు బాబును ఇచ్చే సమయంలో క్షేమంగా చూసుకోవాలని చెప్పినట్లు కన్నీరు పెట్టుకుంది సునిత. కానీ ఇప్పుడు ఒక్కసారే ఫ్లేట్ ఫిరాయించిందని ఆరోపిస్తుంది సునిత. అయితే ఇందిర మాత్రం తన బాబు ని ఎవరికీ అమ్మలేదని.. తన బాబు కోసం సునిత వాళ్ల ఇంటికి వస్తే తమపై దాడి చేస్తున్నారని ఆమె ఆరోపిస్తుంది.
ఇది కూడా చదవండి: Viral Video: బిడ్డను తొలిసారి చూసి మురిసిపోయిన తండ్రి జిరాఫీ..! వీడియో వైరల్!
మరోవైపు తాను బాబుని ఎవరికీ అమ్మలేదని.. తన చెల్లెలు ఇదంతా చేసిందని.. తన కొడుకు కోసం వస్తే తమపై దాడి చేసేందుకు యత్నిస్తున్నారని బాబు కన్నతల్లి ఇందిర ఆరోపిస్తుంది. వీరిద్దరి మద్య గొడవ ముదిరిపోవడంతో పోలీసులు, ఐసీడీఎస్ అధికారులు రంగంలోకి దిగి చిన్నారిని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. పసికందు కొనుగోలు అంశంపై విచారణ చేపట్టారు. ఈ విషయం పై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.