నేటికాలంలో కొందరు యువత దారుణంగా తయరయ్యారు. ప్రేమో, ఆకర్షణో తెలియని ఓ మైకంలో పడిపోతున్నారు. ప్రేమించిన వారు దక్కకపోతే కొందరు ఆత్మహత్య చేసుకుంటున్నారు. ప్రేమించిన వారిని ఎలాగైన దక్కించుకుకోవాలనే కసితో మరికొందరు హత్యలకు పాల్పడుతున్నారు. తాజాగా ఓ యువతి ప్రియుడితో పెళ్లికి తండ్రి అడ్డోస్తున్నాడని దారుణంగా హత్య చేసింది. ఆ తరువాత ఆస్తి వివాదమే హత్యకు కారణమంటూ ఓ నాటకం ఆడింది. చివరికి పోలీసుల తమదైన స్టైల్ లో విచారిస్తే అసలు నిజం బయటపడింది. ఈ దారుణ ఘటన మహబూబాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. మహబూబాబాద్ మండలం వేమునూరులో ప్రభావతి అనే యువతి ఉంది. ఆమె అదే గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లు అనే యువకుడి తో ప్రేమలో పడింది. ఇద్దరు కొన్నాళ్లు ప్రేమించుకున్నారు. ఈక్రమంలో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అయితే ప్రభావతి తండ్రి వారిద్దరి పెళ్లికి ఒప్పుకోలేదు. ఇలా వారి పెళ్లి ప్రయత్నాలకు ప్రభావతి తండ్రి అడ్డు చెప్తుతున్నాడని. ఈ క్రమంలో ప్రియుడితో కలసి తన తండ్రి అడ్డు తొలగించుకోవాలని ప్రభావతి భావించింది. ప్రియుడితో కలసి కర్రతో దారుణంగా తండ్రిని కొట్టి చంపింది. అనంతరం కేసు నుంచి ప్రియుడిని తప్పించేందుకు ఆస్తి వివాదం తెరపైకి తెచ్చింది.
ఆస్తి విషయంలో వివాదంతో పాటు తాగొచ్చి నిత్యం వేధించడంతోనే తన తండ్రిని చంపినట్లు స్థానికులకు, పోలీసులకు తెలిపింది. అయిన ప్రభావతి మాటల్లో తేడాను కనిపెట్టిన పోలీసులు ప్రభావతిని తమదైన శైలిలో విచారిస్తే.. అసలు నిజం చెప్పింది. దీంతో ఆమెతో పాటు ఆమె ప్రియుడిపై హత్య కేసు నమోదు చేశారు. ఈ హత్యలో వీరిద్దరేనా? ఇంకా ఎవరి ప్రమేయమైన ఉందా? అనే కోణంలో కూడా పూర్తి స్థాయిలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. మరి.. ఈ దారుణమైన ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.