తెలంగాణలో రేషన్ అందుకుంటున్న పేద ప్రజలకు శుభవార్త. రాష్ట్ర వ్యాప్తంగా ఆగస్టు మాసం నుంచి లబ్దిదారులకు పదిహేను కిలోల చొప్పన ఉచిత బియ్యం పంపిణీ చేస్తామని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమిషనర్ వి. అనిల్ కుమార్ తెలిపారు. ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ యోజన పథకం కింద ఈ కార్యక్రమం చేపట్టబోతున్నారు. దేశ వ్యాప్తంగా కరోనా సంక్షోభం నుంచి లబ్దిదారులకు ఐదు కిలోల ఉచిత బియ్యం పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే.
ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం ఉచిత బియ్యం పంపిణీ విషయం బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. అయితే 2022 జనవరి నుంచి సెప్టెంబర్ వరకు ఈ పంపిణీ కొనసాగించబడుతుందని ఇటీవల కేంద్రం ప్రకటించింది. కాకపోతే కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఈ పథకాన్ని సరైన పద్దతిలో అమలు చేయకపోవడంతో కొటాకు కోత పెడుతూ వస్తుంది. గత మే నెలలో మొత్తానికే ఉచిత బియ్యం పంపిణీ ఎత్తివేయడంతో విమర్శలు వెల్లువెత్తాయి.
తెలంగాణ రాష్ట్ర విషయానికి వస్తే.. ఇటీవల ఉచిత బియ్యం పంపిణీని పూర్తిగా ఎత్తివేసిన విషయంపై తీవ్ర విమర్శలు రావడంతో ఆగస్టు నెల నుంచి ఒక్కొక్కరికి పదిహేను కిలోల చొప్పున ఉచిత బియ్యం పంపిణీ చేయనున్నట్లు వి. అనీల్ కుమార్ ఒక ప్రకటనలో తెలియజేశారు. ఈ విషయంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది చదవండి: ఉద్యోగాల పేరుతో భారీ మోసం.. కోట్లు వసూలు చేసి బోర్డు తిప్పేసిన ప్రైవేట్ కంపెనీ!