రామానుజాచార్యులు (క్రీ.శ. 1017 – 1137 ) విశిష్టాద్వైతమును ప్రతిపాదించిన గొప్ప తత్వవేత్త, ఆస్తిక హేతువాది, యోగి. రామానుజాచార్యుడు త్రిమతాచార్యులలో రెండోవాడు. ”అందరి దుఃఖాలూ దూరం చేయడానికి నేనొక్కడినే నరకంపాలైనా ఆనందంగా అంగీకరిస్తాను. మాధవుని ముందు మనుష్యులందరూ సమానులే. అతని నామాన్ని పలికే అధికారం అన్ని కులాలకీ ఉంది. అతని ఆలయంలోకి ప్రవేశించే అర్హత కులాలకు అతీతంగా అందరిదీ”.. ఇవి రామానుజులు వేర్వేరు సందర్భాల్లో చెప్పిన మాటలు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఆయన పేరు మార్మొగిపోతుంది. కారణం రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ నియోజకవర్గం శంషాబాద్ మండల పరిధిలోగల ముచ్చింతల్ చిన్న జీయర్ స్వామి ఆశ్రమంలో నిర్వహిస్తోన్న శ్రీరామానుజాచార్యుల సహస్రాబ్ది సమారోహ ఉత్సవాలు.
రామానుజాచార్యుల చరిత్ర..
రామానుజాచార్య హిందూమతానికి చెందిన భక్తి ఉద్యమకారులు, సిద్ధాంతకర్త. క్రీస్తు శకం 1017లో పుట్టి 1137లో సమాధి అయ్యారు. తమిళనాడులో శ్రీపెరంబుదూరులో బ్రాహ్మణ కులంలో పుట్టారు. కాంచీపురంలో చదువుకున్నారు. అక్కడి వరదరాజ స్వామిని పూజించారు. శ్రీరంగం వీరి ప్రధాన కేంద్రం. ఆయన సమాధి (బృందావనం లేదా తిరుమేని) ఇప్పటికీ శ్రీరంగం రంగనాథ స్వామి గుడిలో ఉంది.
On the auspicious occasion of unveiling the #StatueOfEquality of holy saint Sri Ramanujacharya in Hyderabad, I would like to offer my humble obeisance to HH Sri Chinna Jeeyar Swamiji for his amazing efforts 🙏 pic.twitter.com/kCBpi53voP
— KTR (@KTRTRS) February 5, 2022
విశిష్టాద్వైతం సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. దీన్ని పాటించేవారినే శ్రీ వైష్ణవులుగా గుర్తిస్తారు. నుదుటన నిలువు నామం పెట్టుకుని భుజాలపై శాశ్వతంగా, శంఖ చక్రాల ముద్రలు వేసుకోవడం ఈ శాఖ/మతం లక్షణం. ఈ మత శాఖకు చెందిన సన్యాసాశ్రమం తీసుకున్న వారిని జీయర్లు అంటారు. ఇలయ పెరుమాళ్, ఎంబెరుమానార్, యతిరాజ, భాష్యకార వంటి పేర్లున్నాయి. వేదార్థ సంగ్రహం, శ్రీ భాష్యం, గీతా భాష్యం వంటి గ్రంథాలు రాశారు. శంకరాచార్యుల అద్వైతాన్ని సిద్ధాంతపరంగా తీవ్రంగా విభేధించారు.
రామానుజాచార్యులు తీసుకువచ్చిన సంస్కరణలు..
శ్రీవైష్ణవుల మాటల్లో చెప్పాలంటే.. గోష్ఠీపూర్ణుడనే గురువు చెప్పిన రహస్య అష్టాక్షరీ మంత్రాన్ని ఎవరికీ చెప్పకూడదు అన్న నిబంధన ఉన్నప్పటికీ.. రామానుజాచార్యులు.. గుడి గోపురం ఎక్కి గట్టిగా అందిరికీ వినిపించేలా చెప్పారు. ఎవరికైనా చెబితే విన్న వారు పుణ్యాత్ములు, చెప్పిన వారు పాపాత్ములు అవుతారన్న నిబంధనను కావాలని అతిక్రమించారు. అందరికీ పుణ్యం వచ్చినప్పుడు తనకు పాపం వచ్చినా పర్వాలేదనేది రామానుజాచార్యుల సిద్ధాంతం.
The Illuminated 216-Foot Tall Statue Of Equality @ Muchintal Village, Shamshabad, Hyderabad. pic.twitter.com/oD0ekRC9qd
— Hi Hyderabad (@HiHyderabad) February 2, 2022
అలానే తిరుమల తిరుపతి వేంకటేశ్వర స్వామి దేవాలయ పూజా విధానాన్ని వ్యవస్థీకృతం చేసి, పర్యవేక్షణకు అక్కడ జీయంగార్ల వ్యవస్థను ఏర్పాటు చేశారు రామానుజాచార్యులు. కులోత్తుంగ చోళుడు శైవ మత భక్తితో వైష్ణవులను హింసిచినప్పుడు అక్కడ నుంచి తరలించిన ఉత్సవ మూర్తులతో తిరుపతిలో గోవిందరాజ స్వామి గుడి కట్టించారు. కొన్ని దేవాలయాలలో దళితుల ఆలయ ప్రవేశానికి కృషి చేశారు. కింది కులాల వారిని వైష్ణవులుగా (మతం) మార్చారు. కొందరికి ఆలయంలో అర్చకత్వ అవకాశం కూడా కల్పించారు.
శ్రీరంగనాథ ఆలయం నుంచే సంస్కరణలు
తన నిర్వహణలోని శ్రీరంగనాథ దేవాలయం నుంచే సంస్కరణలు ఆరంభించారు. మూఢాచారాలకు స్వస్తి పలికారు. కుల వివక్ష లేకుండా భగవంతుడిని దర్శించుకునేలా, పెరుమాళ్ల ఉత్సవంలో అందరూ పాల్గొనేలా విధి విధానాలను సవరించారు. ఏడు ప్రాకారాలతో నిర్మితమైన శ్రీరంగనాథ ఆలయంలో అడుగడుగునా ఎన్నో ప్రత్యేకలున్నాయి. వాటిలో ముఖ్యంగా చెప్పుకోదగ్గది శ్రీ రామానుజాచార్యుల వారి శరీరం. సామాన్య శకం 11 – 12 శతాబ్ధాల మధ్య రామానుజాచార్యులు శ్రీరంగంలో శరీరాన్ని విడిచి పెట్టారు.
ఇప్పటికి చెక్కుచెదరని శరీరం..
అప్పటి నుంచి ప్రత్యేక లేపనాలను అద్ది ఆయన శరీరాన్ని భద్రపరుస్తున్నారు. శ్రీరంగంలోని 4వ ప్రాకారంలో ఉన్న రామానుజాచార్యుల ఆలయాన్ని సందర్శించినా, అక్కడ ఉన్నది ఆయన దివ్య శరీరం అని మాత్రం గుర్తించలేరు. పద్మాసనంలో యోగ భంగిమలో కూర్చుని రామానుజులు ఇక్కడ శరీరాన్ని విడిచిపెట్టారు. ఆ కూర్చున్న భంగిమలోనే ఇప్పటికీ ఆ శరీరం కనిపిస్తుంది. ఏటా రెండు సార్లు ఆయన కోసం ఓ ఉత్సవం నిర్వహిస్తారు.
Telangana | Prime Minister Narendra Modi inaugurates the 216-feet tall ‘Statue of Equality’ commemorating the 11th-century Bhakti Saint Sri Ramanujacharya in Shamshabad
Track latest news updates here https://t.co/BfPY8JZQLF pic.twitter.com/EgVS49QmKM— Economic Times (@EconomicTimes) February 5, 2022
ఆ సమయంలో కర్పూరం, కుంకుమ పువ్వును ఓ ముద్దగా నూరి రామానుజుల వారి శరీరానికి పూస్తారు. అందువల్ల ఆయన శరీరం ఓ ఎర్రని వర్ణంలో విగ్రహంలా మెరుస్తూ కనిపిస్తుంది. అయితే హారతి ఇచ్చే సమయంలో ఆయన కళ్లు, గోర్లను మనం స్పష్టంగా గుర్తించవచ్చు. కుంకుమ పువ్వు లేపనాన్ని అక్కడ అద్దకపోవడం వల్ల హారతి వెలుగులలో అవి మరింత ప్రకాశవంతంగా కనిపిస్తాయంటారు.
వెయ్యి కోట్ల రూపాయల ప్రాజెక్ట్
మొత్తం ప్రాజెక్టుకు 1,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతోందని నిర్వాహకులు చెబుతున్నారు. ఈ మొత్తం స్థలం 45 ఎకరాల్లో విస్తరించి ఉండగా, ఆ స్థలాన్ని ప్రముఖ వ్యాపారవేత్త జూపల్లి రామేశ్వర రావు విరాళంగా ఇచ్చినట్టు తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు మీడియాకు తెలిపారు. విగ్రహం తయారీలో 7 వేల టన్నుల పంచలోహాలను ఉపయోగించినట్టు నిర్వాహకులు చెబుతున్నారు. విగ్రహాన్ని చైనాలో తయారు చేశారు. విగ్రహం ఆవిష్కరణ సందర్భంగా 14 రోజుల పాటు యజ్ఞానాన్ని నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 5న ప్రధాని మోదీ 216 అడుగుల విగ్రహం, 108 దివ్యదేశాలను ఆవిష్కరిస్తారు. ఫిబ్రవరి 13న రాష్ట్రపతి రామనాథ కోవింద్ 120 కేజీల బంగారు విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. ఈ విగ్రహానికి సమతా మూర్తి, ఇంగ్లీషులో స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ అని పేరు పెట్టారు.