పోలీసులు ప్రజల రక్షణకే కాకుండా వారి కష్టసమయంలోనూ తోడుగా నిలుస్తున్నారు. ఈ మద్య మనిషికి సహాయం చేయడం కాదు కదా.. పరాయి మనుషులను పట్టుకోవడానికి కూడా భయపడుతున్నారు. ముఖ్యంగా కరోనా మహమ్మారి విజృంభించిన తర్వాత మనిషిన చూస్తే మనిషి భయపడే పరిస్థితులు ఎదురయ్యాయి. సాధారణంగా పోలీసులు అంటే కర్కశంగా ఉంటారని… వారి దగ్గరకు వెళ్లాలన్నా భయపడిపోతుంటారు.
ఒక రకంగా చెప్పాలంటే పోలీస్ స్టేషన్లోకి అడుగు పెట్టాలంటేనే భయపడతారు. కానీ తెలంగాణలో ఫ్రెండ్లీ పోలీస్ వ్యవస్థ కొనసాగుతుంది. ఏ చిన్న ఇబ్బంది వచ్చినా పోలీసులు మేం ఉన్నాం అంటూ భరోసా ఇస్తున్నారు. అంతే కాదు పలు సందర్భాల్లో కష్టాల్లో ఉన్నవారిని ఆదుకొని మానవత్వం చాటుకుంటున్నారు. హైదరాబాద్ నగరంలోని ఓ పోలీస్ మానవత్వం చాటుకున్నాడు. ఎదుటి వారు కష్టాల్లో ఉంటే సహాయం చేసి మంచితనం చాటుకున్నాడు.
హైదరాబాద్ లోని బోరబండ బస్టాప్ వద్ద ఒక మహిళ ఆకలితో అలమటిస్తున్న విషయాన్ని అక్కడ పెట్రోలింగ్ విధులు నిర్వహిస్తున్న పోలీస్ గమనించాడు. వెంటనే ఆమె వద్దకు వెళ్లి పరిస్థితి గురించి అడిగి భోజనం తీసుకు వచ్చి స్వయంగా వడ్డించాడు. ఆమె కడుపు నిండా తినే వరకు ఉండి మంచినీళ్లు ఇచ్చి వెళ్లాడు. పోలీస్ చేస్తున్న మంచిపనిని ఒక వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ వీడియో చూసిన వారు ఆ పోలీస్ ని ఎంతగానో మెచ్చుకుంటున్నారు.
Food distribution to hunger beggar family at borabanda bus stop by SR Nagar patrol staff. pic.twitter.com/9ws7o0s2fa
— SHO SR NAGAR (@shosrnagar) April 25, 2022