Lion: ఓ వయసు రాగానే సాధారణంగా మనుషులకు శుక్లాలు రావటం జరుగుతుంటుంది. వాటి కారణంగా కళ్లు కనిపించకుండా పోతాయి. దీంతో కంటి ఆపరేషన్ చేయించుకోక తప్పదు. శుక్లాలు కేవలం మనుషులకు మాత్రమే కాదు. జంతువులకు కూడా వస్తాయి. కానీ, పాపం అవి శుక్లాలు వచ్చాయని, తమకు కళ్లు కనపించటం లేవని బయటకు చెప్పలేవు. కాబట్టి.. ఆ విషయం ఎవరికీ తెలీదు. అలా వేటాడలేక, సరిగ్గా నడవలేక, ఆకలితో అలమటించి చచ్చిపోతాయి. అయితే, ఓ సింహం మాత్రం అదృష్టం బాగుండి శుక్లాల బారినుంచి బయటపడింది. శుక్లాల కోసం ఆపరేషన్ కూడా చేయించుకుంది. ఈ సంఘటన గుజరాత్‌లో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. గుజరాత్, గిర్ అడవుల్లోని ఓ ఐదేళ్ల మగ సింహం శుక్లాల బారిన పడింది. దాని రెండు కళ్లు కనిపించకుండా పోయాయి. ఓ సారి అటవీ సిబ్బంది ఆ మగ సింహాన్ని చూశారు. అది తన ముందున్న వాటిని చూడలేకపోతోందని గుర్తించారు. దీంతో దాన్ని రెస్క్యూ సెంటర్‌కు తీసుకువచ్చారు. వెటర్నరీ డాక్టర్లు.. ఓ కంటి వైద్యుడు సింహం కళ్లను పరీక్షించారు. దానికి శుక్లాలు వచ్చినట్లు తేల్చారు. ఆ వెంటనే సర్జరీ కోసం దాన్ని శక్కర్ బాగ్ జూకి తరలించారు.
అక్కడ దాని ఐ బాల్స్ ను తొలగించి, మధురైనుంచి ఆర్డర్ చేసి తెప్పించిన కృత్తిమ ఐ బాల్స్‌ను అమర్చారు. మొదట ఓ కంటికి చికిత్స చేసి పరిశీలనలో ఉంచారు. అది సరిగ్గా చూడగలుగుతోందని నిశ్చయించుకున్నాక రెండో కంటికి కూడా ఆపరేషన్ చేశారు. ప్రస్తుతం అది రెండు కళ్లతో చూడగలుగుతోంది. మరి, సింహానికి కంటి ఆపరేషన్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
సింహానికి 🦁 కంటి ఆపరేషన్ చేశారు.😳
అసలు ఈ సింహానికి 👀 కనిపించడం లేదనే విషయం ఎలా బయటపడిందంటే…#LionEyeSurgery #GirForest #GujaratLions pic.twitter.com/BfBZ43klIN— BBC News Telugu (@bbcnewstelugu) June 9, 2022
ఇవి కూడా చదవండి : ఆస్పత్రికి వెళ్లి ట్రీట్ మెంట్ చేయించుకున్న తల్లికోతి.. వీడియో వైరల్