కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటన ప్రకంపనలు రేపుతోంది. తెలంగాణలో రాహూల్ పర్యటనపై అధికార టీఆర్ఎస్ నేతలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. ఓరుగల్లులో నిన్న నిర్వహించిన రైతు సంఘర్షణ సభ సక్సెస్ అవడంతో కాంగ్రెస్ నేతలు మాంచి జోష్ మీదుండగా, అధికార టీఆర్ఎస్ నేతలు రాహుల్ సభపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. నటుడు, రాజకీయ నేత ప్రకాశ్ రాజ్ ఇటీవల సీఎం కేసీఆర్ తో ఎంతో సన్నిహితంగా ఉంటున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన రాహూల్ గాంధిని ఉద్దేశించి ఒక ట్వీట్ చేశారు.
వరంగల్ లో రాహూల్ గాంధీ పర్యటనలో తెలంగాణ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. తెలంగాణలో ఇప్పుడు రాజరిక వ్యవస్థ నడుస్తుందని వ్యాఖ్యలు చేశారు. దీనిపై ప్రకాశ్ రాజ్ స్పందిచారు. తెలంగాణ లో గొప్ప నాయకుడుగా పేరు తెచ్చుకున్నారు కేసీఆర్.. కొంతమంది ఫూల్స్‌ని పెట్టుకుని మీరేం చేస్తారో చెప్పాలంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఫూల్స్ అనే పదం వాడినందుకు కాంగ్రెస్ నేతలు ప్రకాశ్ రాజ్ పై భగ్గుమంటున్నారు.
ఇక ప్రకాశ్ రాజ్ చేసిన వ్యాఖ్యలపై ఎమ్మెల్యే సీతక్క ఫైర్ అయ్యారు. తెలంగాణ ఉద్యమంలో నిన్నెక్కడా చూడలేదని ఆమె అన్నారు. కాంగ్రెస్ నేతలను ఫూల్స్ అంటున్న ప్రకాష్ రాజ్.. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా విభజించింది కాంగ్రెస్ ప్రభుత్వం అని గుర్తుంచుకోవాలని ఆన్నారు. ఇలాంటి విషయాల గురించి పూర్తిగా తెలుసుకోని మాట్లాడాలని.. లేదంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సి వస్తుందని.. ఒకరి గురించి మాట్లాడేటపుడు హద్దుల్లో ఉంటే మంచిదని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.
Who are you? #JustAsking
We have never seen you in Telangana moment, you call congress leaders bunch of fools but remember always congress leaders brought Telangana so mind your business don’t be against our Telangana..@RahulGandhi @manickamtagore @revanth_anumula https://t.co/SXt0q3IMyP— Danasari Anasuya (Seethakka) (@seethakkaMLA) May 6, 2022