మన సమాజంలో చాలా మంది తమకు దేవుడు పూనాడని.. వారి ద్వారా దేవుడు తమ వాక్కు జనాలకు చేరవేస్తాడనే నమ్మకం అనాదిగా ఉంది. సికింద్రాబాద్ బోనాల సందర్భంగా నిర్వహించే రంగం వేడుక కూడా ఇలాంటిదే. కొందరు దీన్ని నమ్ముతారు.. మరి కొందరు కొట్టి పారేస్తారు. అయితే కొన్ని సార్లు అనుకోని వింతలు కూడా చోటు చేసుకుంటాయి. తాజాగా ఈ కోవకు చెందిన సంఘటన తెలంగాణ, ములుగు జిల్లాలో చోటు చేసుకుంది.
ఓ వ్యక్తి తనకు కలలో శివుడు కనిపించాడని.. గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో నందితో పాటు శివయ్య వెలిశాడని బయటకు తీయాలని కోరాడు. మొదట్లో ఆ వ్యక్తి మాటలను ఎవరు పెద్దగా పట్టించుకోలేదు. కానీ పదే పదే చెప్తుండటంతో.. అతడు చెప్పిన చోట తవ్వకాలు జరపగా.. నిజంగా శివలింగం ప్రత్యక్షం అయ్యింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో తెగ వైరలవుతోంది. ఆ వివరాలు..
ఇది కూడా చదవండి: శివయ్య భక్తుడి వింత! చేతుల్లేవ్.. కాళ్లకు తాడు కట్టుకుని నీటిలో ఈత!ములుగు జిల్లా, మంగపేట మండలానికి చెందిన కృష్ణ అనే వ్యక్తి ఆకస్మాత్తుగా పూనకాలతో ఊగిపోయాడు.. గ్రామ శివారు అడవిలోని రామక్కగుట్టపై శివలింగం ఉందని, త్వరగా తీసి పూజలు నిర్వహించాలని ఆదేశించాడు. ఈ క్రమంలో కృష్ణ ఆదేశాల మేరకు గ్రామస్థులు ఆ ప్రాంతంలో తవ్వారు. అలా తవ్విన వెంటనే.. వారంతా షాక్ అయ్యారు. గుట్ట ప్రాంతంలోని దేవరబాల చెట్టు కింద పుట్టలో శివలింగం కోసం తవ్వుతుండగా మొదట్లో తేల్లు, పాములు కనపడడంతో భయబ్రాంతులకు గురయ్యారు.
ఇది కూడా చదవండి: కృష్ణా జిల్లాలో శివయ్య మహిమ: మహిళ కలలోకి వచ్చి రహస్యం. ఆయన చెప్పిన చోట తవ్వగా అద్భుతం!
అయినా ధైర్యం చేసి అలా తవ్వుతూ వెళ్లారు. ఆశ్చర్యంగా కృష్ణ చెప్పిన మాదిరిగానే అక్కడ వారికి శివలింగం ప్రత్యక్షం అయ్యింది. అప్పటికే రాత్రి కావడంతో శివలింగాన్ని చెట్టు మొదట్లో ప్రతిష్టించి పసుపు, కుంకుమ చల్లి టెంకాయ కొట్టి తిరిగి వెళ్లిపోయారు. ఈ విషయం చుట్టూ పక్కల గ్రామాల ప్రజలకు తెలియడంతో.. ప్రస్తుతం జనాలు ఇక్కడకు తండోపతండాలుగా తరలి వస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరలవుతోంది. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: భూకబ్జా కేసులో కోర్టుకు హాజరైన పరమశివుడు..!