దేశ వ్యాప్తంగా నేడు హూలీ సంబురాలు ఘనంగా జరుపుకుంటున్నారు. గత రెండేళ్లుగా కరోనా ప్రభావంతో హూలీ పండుగ పెద్దగా జరుపుకోలేదు. ప్రస్తుతం కరోనా ప్రభావం తగ్గడంతో ప్రజలు బయటకు వచ్చి ఆనందంగా హూలీ వేడుకలు జరుపుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లో చిన్నా.. పెద్ద అనే తేడా లేకుండా రంగుల్లో మునిగిపోయారు. సినీ, రాజకీయ నేతలు సైతం హూలీ సంబురాల్లో మునిగిపోయారు. సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి దూందాం స్టెప్పులు వేశారు. యువతతో కలిసి కేరింతల మధ్య హల్‌చల్ చేశారు.
సంగారెడ్డి పట్టణంలో కాంగ్రెస్ కార్యకర్తలతో పాటు స్థానిక పట్టణ యువత, తన సన్నిహితుల ఆధ్వర్యంలో హోలీ నిర్వహించారు. డప్పు వాయిస్తూ కార్యకర్తలతో కలిసి ఆయన తీన్మార్స్టెప్పులు వేశారు. డప్పు వాయిస్తున్న సమయంలో జగ్గారెడ్డిపై సన్నిహితులు నోట్ల వర్షం కురిపించారు. హోలీ సంబురాల్లో హల్ చల్ చేసి యువతలో జగ్గారెడ్డి ఉత్సాహం నింపారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.