రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాక.. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది మిర్యాలగూడకు చెందిన ప్రయణ్ హత్య కేసు. కుమార్తె.. వేరే కులం వ్యక్తిని వివాహం చేసుకుందని ఆగ్రహంతో రగిలిపోయిన మారుతీ రావు.. అత్యంత దారుణంగా హత్య చేయించాడు. ఆ తర్వాత కొన్నేళ్లకు ఆయన కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. తాజాగా ఈ కేసుకు సంబంధించి మరో సంఘటన చోటు చేసుకుంది. హత్య కేసులో నిందితుడు అయిన అబ్దుల్ బారీకి గుండెపోటు వచ్చింది. పోలీసులు అతడిని హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి ఆరోగ్యం బాగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఆ వివారలు..
ప్రస్తుతం నల్గొండ జిల్లా జైలులో ఉన్న అబ్దుల్ బారీ శుక్రవారం రాత్రి గుండెపోటుకు గురయ్యాడు. అతడిని గమనించిన జైలు అధికారులు హుటాహుటిన అంబులెన్స్‌లో హైదరాబాద్‌లోని నిమ్స్ ఆస్పత్రికి తరలించారు. అతడిని పరీక్షించిన డాక్టర్లు ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగానే ఉందని తెలిపారు.
మిర్యాలగూడకు చెందిన వ్యాపారవేత్త మారుతీరావు కుమార్తె అమృతను మరో సామాజిక వర్గానికి చెందిన ప్రణయ్ ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఆ విషయం నచ్చని మారుతీరావు 2018 సెప్టెంబర్‌లో సుపారీ గ్యాంగ్ సాయంతో ప్రణయ్‌ని హత్య చేయించాడు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ప్రణయ్ పరువు హత్య దేశవ్యాప్తంగా సంచలనం రేపడంతో పోలీసులు ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. మారుతీరావుతో పాటు అతడికి సుపారీ గ్యాంగ్‌ను సమకూర్చిన రౌడీషీటర్ అబ్దుల్ బారీ సహా నిందితులందరినీ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఆ తర్వాత బెయిల్‌పై బయటికొచ్చిన మారుతీరావు 2020, మార్చి నెలలో హైదరాబాద్ ఖైరతాబాద్‌లోని ఆర్యవైశ్య భవన్‌లో విషం తాగి ఆత్మహత్య చేసుకున్నారు. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.