Vikarabad: వికారాబాద్‌లో ఓ వ్యాపారి హెచ్‌డీఎఫ్‌సీ అకౌంట్‌లో భారీగా నగదు జమకావటం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. వికారాబాద్‌కు చెందిన వెంకట్ రెడ్డి ఖాతాలోకి ఆదివారం ఉన్నట్టుండి ఏకంగా రూ.18 కోట్లు వచ్చి పడ్డాయి. దీంతో సదరు వెంకట్ రెడ్డి షాక్ తిన్నాడు. తన అకౌంట్‌లో అంత పెద్ద మొత్తం డబ్బులు ఉండటం ఏంటని అనుకున్నాడు. వెంటనే బ్యాంక్‌కు ఫోన్ చేసి విషయం చెప్పాడు. తన అకౌంట్‌లో రూ.18 కోట్ల డబ్బు ఉన్నట్లు చూపిస్తోందని చెప్పాడు. దీంతో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు వారు అప్రమత్తమయ్యారు. సాంకేతిక లోపం కారణంగానే అతడి అకౌంట్‌లోకి డబ్బు జమైందని తెలిపారు. సాధారణంగా కొత్త సాఫ్‌వేర్ అప్‌డేట్ చేసేటప్పుడు ఇలాంటివి జరుగుతుంటాయని వెల్లడించారు. అతడి అకౌంట్‌ను ఫ్రీజ్ చేసి, డబ్బులు రికవరీ చేసే పనిలో పడ్డారు.
ఒక్క రోజులో కోటీశ్వరులు అయిపోయిన 100 మంది..
ఆదివారం తమిళనాడు చెన్నైలో 100 మంది హెచ్‌డీఎఫ్‌సీ ఖాతాదారులు కోటీశ్వరులుగా మారిపోయారు. ఒక్కోరి ఖాతాలోకి ఏకంగా 13 కోట్లు వచ్చిపడ్డాయి. ఇది కూడా బ్యాంకు తప్పిదం కారణంగానే జరిగింది. చెన్నై టీ నగర్ బ్రాంచ్‌లోని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో ఖాతాలు ఉన్న 100 మంది అకౌంట్లలోకి ఆదివారం తలా 13 కోట్ల రూపాయల చొప్పున జమ అయ్యాయి. మొత్తం 1300 కోట్ల రూపాయలు వారి అకౌంట్లలోకి వెళ్లాయి. సాంకేతిక లోపం కారణంగానే ఇలా జరిగిందని బ్యాంకు చెప్పుకొచ్చింది. కొత్త సాఫ్ట్‌వేర్ కారణంగా ఈ సమస్య తలెత్తినట్లు ప్రకటించింది. 100 మంది అకౌంట్లను ఫ్రీజ్ చేసి నగదు రికవరీపై దృష్టి సారించింది. మరి, ఈ రెండు ఘటనలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : Nepal: 19 మంది ప్రయాణికులున్న విమానం గల్లంతు.. అందులో నలుగురు భారతీయలు!