KTR: ఏపీలో పరిస్థితులపై తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. కేటీఆర్ వ్యాఖ్యలను కొందరు ఏపీ మంత్రులు, ప్రజా ప్రతినిధులు తప్పబట్టడం.. వీరికి తెలంగాణ ప్రజా ప్రతినిధులు కొందరు కౌంటర్ ఇవ్వటం.. శుక్రవారం మొత్తం రాజకీయ వేడి కొనసాగింది. ఈ నేపథ్యంలో శుక్రవారం రాత్రి కేటీఆర్ చేసిన ట్వీట్ ఈ వివాదానికి సెట్టర్ దించింది. కేటీఆర్ తన ట్వీట్లో ‘‘ ఈ రోజు ఓ సమావేశంలో అమాయకంగా తెలియక చేసిన వ్యాఖ్యలు ఏపీలోని నా స్నేహితులను అనవసరంగా బాధించినట్లున్నాయి. ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డి నాకు సోదర సమానులు. ఆయన నాయకత్వంలో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నా’’ అని అన్నారు.
కాగా, శుక్రవారం కాన్ఫెడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (క్రెడాయ్) ప్రోపర్టీ షో సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. పక్క రాష్ట్రంలో తోటలున్న ఓ స్నేహితుడు సంక్రాంతికి సొంతూరు వెళ్లాడు. తిరిగి హైదరాబాద్‌కు వచ్చాక నాకు ఫోన్ చేసి.. ‘ మీ రాష్ట్రంలో ప్రతి గ్రామం నుంచి నాలుగు బస్సులు పెట్టి ప్రజల్ని పక్క రాష్ట్రానికి పంపించండి’ అని చెప్పాడు. ఎందుకని నేను ప్రశ్నించా. ‘మా ఊరిలో నాలుగు రోజులున్నా.. కరెంట్ లేదు, నీళ్లు లేవు, రోడ్లు అధ్వానంగా ఉన్నాయి. హైదరాబాద్‌కు తిరిగి వచ్చాకే ఊపిరి పీల్చుకున్నట్లు ఉంది’ అని నాతో చెప్పాడు. మన ప్రభుత్వం విలువ, అభివృద్ధి తెలియాలంటే పక్క రాష్ట్రాలకు పంపించాలని ఆ స్నేహితుడు సూచించాడు’ అని అన్నారు. మరి, కేటీఆర్ తాజా ట్వీట్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
It appears that an innocuous comment that I had made at a meeting earlier today may have caused some unintentional pain to my friends in AP
I enjoy a great brotherly equation with AP CM Jagan Garu & wish that the state prospers under his leadership
— KTR (@KTRTRS) April 29, 2022
ఇవి కూడా చదవండి : KTR: మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలపై ఏపి మంత్రుల స్పందన!