హైదరాబాద్‌లో వరుస రోడ్డు ప్రమాదాలు కలకలం రేపుతున్నాయి. మితిమీరిన వేగం.. మద్యం సేవించి.. నిర్లక్ష్యంగా వాహనాలు నడపడం వంటి కారణాలు ఘోర దుర్ఘటనలకు దారి తీస్తున్నాయి. వాహనదారుల తప్పిదాలతో అభంశుభం ఎరుగని వారు దుర్మరణం చెందుతున్నారు. మంగళవారం సాయంత్రం నటుడు నందమూరి బాలకృష్ణ ఇంటి వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అయితే వాహనం బాలకృష్ణ ఇంటి గేట్‌ను ఢీకొట్టి ఆగిపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. నందమూరి బాలకృష్ణ జూబ్లీహిల్స్ రోడ్డు నెంబర్ 45లో నివాసం ఉంటున్న విషయం తెలిసిందే.
కారు డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్న ఓ యువతి.. అంబులెన్స్ వస్తుందని దారి ఇవ్వబోయింది. ఈ క్రమంలో కారు అదుపు తప్పడంతో డివైడర్ ఎక్కి.. ఆ పక్కనే ఉన్న సినీ హీరో నందమూరి బాలకృష్ణ ఇంటి వైపుకు దూసుకెళ్లింది. అయితే వాహనం బాలకృష్ణ ఇంటి గేట్‌ను ఢీకొట్టి ఆగిపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి ప్రమాదం జరుగలేదు. బాలకృష్ణ ఇంటి ముందు రోడ్డు ప్రమాదం జరగడంతో ఒక్కసారిగా జనాలు అక్కడ భారీ సంఖ్యలో పోగయ్యారు. దాంతో అక్కడ కొద్దిసేపు ట్రాఫిక్ జామ్ కాగా, ట్రాఫిక్ పోలీసులు కాసేపట్లో అంతా క్లియర్ చేసి వాహనాలను పంపించేశారు. ట్రాఫిక్ పోలీసులు సదరు యువతికి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ నిర్వహించారు. ఈ పరీక్షలో ఆ యువతి ఆల్కాహాల్ ఏం తీసుకోలేదని నిర్దారణ అయింది. పోలీసులు ఆ వాహనాన్ని బయటకు తీశారు. వాహనదారులకు ఇబ్బందులు కలగకుండా ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
ఇది కూడా చదవండి: Traffic Challans: ఇకపై నేరుగా వాట్సాప్కే ట్రాఫిక్ చలాన్ వివరాలు