సుకుమార్ దర్శకత్వంలో టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన ‘పుష్ప’ దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. సామాన్యుల నుండి సెలెబ్రిటీల వరకు అల్లు అర్జున్ పుష్ప మూవీలోని మేనరిజం ట్రై చేస్తున్నారు. పుష్ప మానియా దేశవిదేశాల్ని చుట్టేస్తోంది. విదేశీ క్రికెటర్లు కూడా పుష్పలో అల్లు అర్జున్ మేనరిజం అనుకరిస్తూ అనేక స్పూఫ్ వీడియోలు, స్కిట్స్ చేశారు. తగ్గేదే లే, పుష్పా అంటే ఫ్లవర్ అనుకుంటివా.. ఫైర్ అనే డైలాగ్ బాగా పాపులర్ అయ్యాయి. ఓ యువకుడు ఆటోపైకి ఎక్కి బన్నీలా స్టంట్ చేశాడు.. ఇది పోలీసులు దృష్టిలో పడటంతో మనోడికి దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు. వివరాల్లోకి వెళితే..
మాదిగి సాయిలు అనే వ్యక్తి గత కొంత కాలంగా ఆటో నడుపుతూ జీవిస్తున్నాడు. ఇటీవల అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమా చూసిన సాయిలు మరో యువకుడితో కలిసి డిఫరెంట్ గా స్టంట్ చేయాలని అనుకున్నాడు. నారాయణఖేడ్ పట్టణంలో జనాలు తిరుగుతున్న సమయంలో ఆటోపై తన స్నేహితుడిని నిలబెట్టి నడిపించాడు. ఈ తతంగం మరో స్నేహితుడు వీడియో తీసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశారు. ఇది కాస్త సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి.
సాయిలు చేసిన వీడియో సోషల్ మాద్యమంలో వైరల్ కావడంతో పోలీసుల దృష్టికి చేరింది. దీంతో నారాయణ్‌ఖేడ్ పోలీసులు సీరియస్‌గా స్పందించారు. ఆటోకి రూ. 1600 జరిమానా విధించారు. ఇలాంటి ప్రమాదకరమైన స్టంట్లు ఎవరైనా చేస్తే పరిస్థితి సీరియస్ యాక్షన్ ఉంటుందంటూ హెచ్చరించారు. ఇలాంటి డేంజర్ స్టంట్స్ చేసేవారికి సరైన బుద్ది చెప్పారని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. ఈ విషయం పై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.