ఖాకీలు అంటే కఠినత్వం. నోరు తెరిస్తే బూతులు తిట్టడం. లేదంటే లాఠీకి పని చెప్పడం లాంటివి చూస్తుంటాం. కానీ ఓ పోలీస్ ఆఫీసర్ నా రూటే సపరేట్ అంటూ నలుగురికి ఆదర్శంగా నిలుస్తున్నాడు. పోలీసు వ్యవస్థపై ప్రజల్లో ఓ మంచి సదభిప్రాయం కల్పించి ఫ్రెండ్లీ వాతావరణం తీసుకురావాలనే సంకల్పంతో ముందుకెళ్తున్నాడు. అందుకే ఆయన పనిచేసిన ప్రతిచోటా వినూత్నమైన కార్యక్రమాలు చేపడుతూ ప్రజలచేత శభాష్ పోలీస్ అనిపించుకుంటున్నారు. ఇక ఇదే కాకుండా జాతీయ గీతంతో ప్రజల్లో చైతన్యం కల్గిస్తూ నలుగురికి మార్గదర్శకంగా నిలుస్తున్నారు. ఇంతటి పేరు ప్రఖ్యాతలను మూటగట్టుకున్న వ్యక్తే మన పింగళి ప్రశాంత్ రెడ్డి.
ప్రస్తుతం ఆయన DSP ప్రమోషన్లో ఉన్నారు. అయితే ఆయన గతంలో కరీంనగర్ జిల్లాలోని జమ్మికుంట సీఐగా విధులు నిర్వర్తించారు. అక్కడ పనిచేసిన సమయంలో ప్రశాంత్ రెడ్డి అక్కడి యువతలో మంచి స్ఫూర్తిని రగిల్చారు. దానికి తోడు అక్కడ నిత్య జనగణమన జాతీయగీతం ఆలపించే కార్యక్రమాన్ని నిర్వహించడంతో దానికి విశేష ఆదరణ లభించింది. ఇక ఇదే కాకుండా మహిళల్లోనూ సేవా స్ఫూర్తి ని తీసుకురావాలని భావించి పేదల కోసం పిడికెడు బియ్యం పోగు చేయాలని సూచించడంతో దానికి కూడా మంచి స్పందన వచ్చింది. ఇలాంటి కార్యక్రమాలు చేయడం ద్వారా క్రైమ్ రేట్ ను పూర్తిగా తగ్గించవచ్చని ప్రశాంత్ రెడ్డి ఆలోచనట.
ఇది కూడా చదవండి: స్టేజీపై డ్యాన్స్తో దుమ్మురేపిన కలెక్టర్! వీడియో వైరల్
ఇక ఆయన స్ఫూర్తితో రాష్ట్రంలో పలు చోట్ల నిత్య జనగణమన గీతాలాపన కార్యక్రమం నిర్వహించడం మొదలు పెట్టారు. గతంలో ఆయన పనితీరు చూసిన హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సి.ఐ. పింగళి ప్రశాంత్ రెడ్డికి మంచి పాలోయింగ్ ఉందని, నిత్యం ప్రజల్లో మమేకమై తలలో నాలుకలా వుంటాడని, తాను చెప్పినా ఇంత జనం రాలేరని, ఓ కార్యక్రమంలో ఈటలే స్వయంగా అన్నారట. ప్రశాంత్ రెడ్డి స్వభావం, ఆయన సేవ స్ఫూర్తి వృత్తి పట్ల అంకిత భావం, ముఖ్యంగా సమాజం పట్ల ఆయనకు ఎంతటి ప్రేమ దీనిని బట్టే తెలుస్తోంది. సమాజం పట్ల ప్రశాంత్ రెడ్డికి ఉన్న అంకితభావంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.