కొందరు నేరస్తులు తమ హైటెక్ తెలివితేటలతో పోలీసులకే షాకిస్తున్నారు. తాజాగా ఈ కోవకు చెందిన సంఘటన ఒకటి తమిళనాడులో చోటు చేసుకుంది. దొంగల తెలివి తేటలు చూసి.. పోలీసులకు మైండ్ బ్లాంక్ అయ్యింది. సాధారణంగా దొంగతనం చేసిన వారు.. ఆ సొత్తు పోలీసుల కంటపడకుండా.. చాలా జాగ్రత్తగా.. ఎవరికి అనుమానం రాని ప్రాంతంలో దాచిపెడతారు. కానీ శ్మశానంలో దాస్తారా.. ఏంటి శ్మశానంలోనా.. ఆ పేరు వింటేనే గుండెల్లో వణుకు పుడుతుంది.. అక్కడ ఎలా దాచార్రా సామి అనిపిస్తుంది కదా. ఇక్కడ దొంగలు ఇంత జాగ్రత్తగా ప్లాన్ చేసినా.. చివరకు పోలీసులకు చిక్కారు. ఆ వివరాలు..
కొన్ని రోజుల క్రితం తమిళనాడు వెల్లూరులోని ప్రముఖ బంగారు దుకాణంలో భారీ చోరీ జరిగింది. పక్కా ప్లాన్ న్‌తో ఏకంగా 15 కేజీల బంగారాన్ని చోరీ చేశాడు ఓ వ్యక్తి. అయితే ఇంత భారీ మొత్తాన్ని ఎక్కడ దాచాలా అని బాగా ఆలోచించి చివరకు శ్మశానవాటిక అయితే బెస్ట్ అని భావించి.. అక్కడ దాచి పెట్టాడు.
బంగారు దుకాణం యజమాని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. సీసీటీవీ ఆధారంగా నిందితుడి కోసం గాలించసాగారు. చివరకు నేరస్థుడిని అరెస్ట్ చేశారు. విచారణలో అతడు చెప్పిన విషయాలు విని పోలీసులే అవాక్కయ్యారు. తాను దొంగిలించిన బంగారాన్ని శ్మశానవాటికలో దాచినట్లు వెల్లడించాడు. అతడు చెప్పిన చోటుకు వెళ్లి తవ్వకాలు జరిపి బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.