భార్యభర్తలుగా విడిపోతున్నాం అని ప్రకటించిన నాగచైతన్య, సమంత దానికి కారణాలను మాత్రం చెప్పలేదు. అసలు వారు వీడిపోడానికి రీజన్ ఏంటీ అని వాళ్ల ఫ్యాన్స్ తెగ మదనపడిపోతున్నారు. అక్టోబర్ 2న విడిపోతున్నాం అనే షాకింగ్ వార్త చెప్పిన చై-సామ్ అనంతరం సోషల్‌మీడియాలో కూడా సైలెంట్ అయిపోయారు. ఈ నేపథ్యంలో సమంత తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో పెట్టిన పోస్టులు తెగ వైరల్ అవుతున్నాయి. విడాకుల ప్రకటన తర్వాత సమంత చేసిన ఫస్ట్ పోస్టు ఇదే.
అందులో.. ‘ఈ ప్రపంచాన్ని నేను మార్చాలనుకుంటే, ముందు నన్ను నేను మార్చుకోవాలి. మనమే అన్ని పనులు చేసుకోవాలి. షెల్ఫ్‌లో ఉన్న దుమ్ము దులపాలి. మధ్యాహ్నం వరకు నిద్రపోతూ మనం చేయాలనుకుంటున్న లక్ష్యాల గురించి కలలు కనొద్దు’ అంటూ ఇన్‌స్టా స్టోరీలో చెప్పుకొచ్చొంది. దీన్ని బట్టి తనకు తానే ఒంటరిగా నిలబడి తన లక్ష్యాలు సాకారం చేసుకునేందుకే సమంత ఈ నిర్ణయాన్ని తీసుకుందా అన్న సందేహాన్ని నెటిజన్లు వ్యక్తం చేస్తున్నారు.