హైదరాబాద్- రాంగోపాల్ వర్మ.. ఈ వివాదాస్పద సినీ దర్శకుడు సినిమాల్లో ఎంత పాపులరో.. తనకు సంబందం లేని అంశాలపై సోషల్ మీడియాలో కామెంట్స్ చేయడంలో అంతకంటే పాపులర్ అని చెప్పవచ్చు. వర్మ ఎప్పుడు ఎవరి మీద ఏ విదమైన కామెంట్ చేస్తాడో ఎవ్వరికి తెలియదు. రాము ట్వీట్టర్లో టైప్ చేస్తున్నాడంటే ఆరోజు ఎవరికో ఒకరికి మూడిందని చెప్పకతప్పదు. అలా అని అందరిపైనా సెటైర్లు వేయడమే కాదు అప్పుడప్పుడు కొందరిపై సానుకూలంగా కూడా స్పందిస్తారు రాంగోపాల్ వర్మ.
ఇక సోషల్ మీడియాలో ఆర్జీవీ కామెంట్స్ అయినా, ఆయన ఇంటర్వ్యూ అయినా భలే క్రేజ్. ఈ క్రమంలో తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి ఎంపిక చేయడంపై రామ్ గోపాల్ వర్మ ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు.. ఆర్జీవీ ఏమన్నారంటే.. లయన్.. రేవంత్ రెడ్డిని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా నియమించి కాంగ్రెస్ పార్టీ ఎట్టకేలకు ఒక సూపర్, ఫెంటాస్టిక్ నిర్ణయం తీసుకుంది.. ఇక ఇప్పుడు పులులన్నీ రేవంత్ రెడ్డి అనే సింహానికి భయపడిపోవాల్సిందే.. అని ట్వీట్ చేశారు. అంతే కాదు ఆ వెంటనే మరో ట్వీట్ చేస్తూ .. రేవంత్ రెడ్డిని అధ్యక్షుడిగా ఎన్నుకున్న తర్వాత కాంగ్రెస్ పార్టీపై మరోసారి ఆసక్తి కలిగింది.. రాహుల్ గాంధీ నువ్వు, మీ అమ్మ ఒక గొప్ప పని చేశారు.. అని వ్యాఖ్యానించారు.
రేవంత్ రెడ్డి పై రాంగోపాల్ వర్మ చేసిన ట్వీట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. రామ్ గోపాల్ వర్మ గతంలోను రేవంత్ పై కామెంట్స్ చేశారు. రేవంత్ రెడ్డి టీడీపీ పార్టీకి గుడ్‌బై చెప్పి కాంగ్రెస్ పార్టీలో చేరిన సమయంలో కూడా ఆర్జీవీ స్పందించిన సందర్బంగాన్ని అంతా గుర్తు చేసుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ ఫిల్మ్ థియేటర్ అయితే రేవంత్ రెడ్డి బాహుబలి అని, బాహుబలి బాక్సాఫీస్‌కి నోట్ల వర్షం కురిపిస్తే రేవంత్ రెడ్డి కాంగ్రెస్‌కి ఓట్ల వర్షం కురిపిస్తాడని వర్మ అప్పుడు కామెంట్ చేశాడు. మరి రేవంత్ రెడ్డి పై రాంగోపాల్ వర్మకు అంత నమ్మకం ఏంటోనని రాజకీయా వర్గాల్లో చర్చ జరుగుతోంది.