ఫిల్మ్ డెస్క్- రామ్ గోపాల్ వర్మ.. ఈ వివాదాస్పద సినీ దర్శకుడి గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. తన సినిమాల కంటే తన మాటలు, చేష్టలతో ఎక్కువ పాపులర్ అయ్యాడు వర్మ. ఎప్పుడూ ఎవరినో ఒకరిపై విమర్శలు, సెటైర్లు వేసే ఆర్జీవి.. తమ మనసుకు ఏది నచ్చితే అది చేస్తుంటారు.
తాజాగా వరంగల్ కు చెందిన కాంగ్రెస్ పార్టీ దంపతులు కొండా సురేఖ, కొండా మురళి జీవిత చరిత్రపై కొండా సినిమా తీస్తున్నారు రామ్ గోపాల్ వర్మ. కొండా ట్రైలర్ విడుదల చేసే విషయంలో హడావుడి చేసి వార్తలలో నిలిచారు రామ్ గోపాల్ వర్మ. ఇదిగో ఇప్పుడు మరో వీడియోతో వార్తల్లో నిలిచారు ఆర్జీవి. తాజాగా పబ్‌లో అమ్మాయిలతో చిందులు వేస్తున్న వీడియోని వర్మ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు.
#mydancepartner pic.twitter.com/O06SaKQ8oJ
— Inaya Sultana (@inaya_sultana) January 28, 2022
రామ్ గోపాల్ వర్మ పోస్ట్ చేసిన ఈ వీడియోలో అమ్మాయిలతో పాటు మద్యం ఏరులై పారుతోంది. ఈ వీడియోలో వర్మ చుట్టూ అమ్మాయిలే ఉన్నారు. జీవితాన్ని అనుభవించడం కూడా ఒక కళే అన్నట్లుగా, మద్యం, అమ్మాయిలతో మునిగిపోయే ఈ వివాదాస్పద దర్శకుడు, ఆ విషయాన్ని పబ్లిక్‌కి చెప్పడానికే అన్నట్లుగా ఇలా వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటాడు.
అన్నట్లు తాజా వీడియోతో పాటు, తాను అమ్మాయిలతో పబ్ లో ఉన్న ఫొటోకి క్యాప్షన్ చెబితే లక్ష రూపాయలు బహుమతి ఇస్తానంటూ వర్మ మరో ట్వీట్ చేశాడు. ఈ ఫొటోలో ఒక చేతిలో మందు బాటిల్ పట్టుకున్న ఆర్జీవి, మరో చేతితో అమ్మాయిని ఘాడంగా హత్తుకుని ముద్దు పెట్టుకుంటున్నారు. ఇలా పబ్‌లో దర్శనమివ్వడం ఆయనకి మాత్రమే చెల్లింది అంటూ ఈ వీడియోపై కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్. బతికితే నీలానే బతకాలి బాసూ.. అంటూ వర్మని ఆకాశానికి ఎత్తేస్తున్నారు కొంత మంది.
A request to all my fans and haters to caption this and the best caption will get a prize of 1 lakh pic.twitter.com/bfvQQjqD4T
— Ram Gopal Varma (@RGVzoomin) January 27, 2022
— Ram Gopal Varma (@RGVzoomin) January 27, 2022
— Inaya Sultana (@inaya_sultana) January 23, 2022
Me cigaretting and grooving with the super lovely @inaya_sultana at #GreaseMonkey pic.twitter.com/EdesClOpkv
— Ram Gopal Varma (@RGVzoomin) January 27, 2022
— Inaya Sultana (@inaya_sultana) January 23, 2022