ఫిల్మ్ డెస్క్- RRR ఈ పాన్ ఇండియా సినిమాపై భారీ అంచానుల నెలకొన్నాయి. ఎప్పటికప్పుడు ఊరిస్తూ వస్తున్న ఈ సినిమా జనవరి 7న విడుదలవుతుందని అంతా భావించారు. కానీ రోజు రోజుకు పెరుగుతున్న కరోనా కేసుల నేపధ్యంలో RRR సినిమా విడుదలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు మేకర్. దీంతో ఎన్టీఆర్, రామ్ చరణ్ అభిమానులంతా నీరసపడిపోయారు.
ముందుగా అనుకున్నట్లు జనవరి 7న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తామన్న ధీమాతో RRR మూవీ ప్రమోషన్ భారీగా చేశారు రాజమౌళి. దాదారు 15 రోజుల నుంచి దేశవ్యాప్తంగా అన్ని ముఖ్యమైన నగరాల్లో జోరుగా ప్రచార కార్యక్రమాలు నిర్వహించారు. ముంబై, ఢిల్లీ, చెన్నై, హైదరాబాద్, కొచ్చి, బెంగళూరు వంటి నగరాల్లో భారీగా ప్రమోషన్స్ నిర్వహించారు. ఈ ఈవెంట్స్ కు RRR యూనిట్ అంతా తరలివెళ్లింది.
రాజమౌళి ప్లానింగ్ ఎప్పటికప్పుడు బెడిసి కొడుతూనే ఉంది. కరోనా దెబ్బకు ఆర్ఆర్ఆర్ వాయిదా పడుతూనే ఉంది. ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ వల్ల సినిమా షూటింగ్ క్యాన్సిల్ అవుతూనే వచ్చింది. మొత్తానికి ఎలాగోలా సినిమాను పూర్తి చేసేశారు. జనవరి 7న విడుదల చేసేందుకు ప్లాన్ చేశారు. కానీ ఈ సారి ఒమిక్రాన్ దెబ్బ కొట్టేసింది. ఒమిక్రాన్ ప్రభావంతో ఆర్ఆర్ఆర్ మరోసారి వాయిదా పడింది.
ఇక RRR సినిమా ప్రమోషన్స్ కోసం దర్శకధీరుడు రాజమౌళి పెద్ద మొత్తంలో ఖర్చు చేశారట. ఇదిగో ఇప్పుడు ఈ ఖర్చు అందరినీ ఆశ్చర్యపోయేలా చేస్తోంది. RRR మూవీ ప్రమోషన్స్ కోసం ఏకంగా 40 కోట్ల రూపాయలను ఖర్చు చేశారని సమాచారం. ఈమేరకు సెన్సార్ బోర్డ్ సభ్యుడు ఉమైర్ సంధు ట్విట్టర్ లో ఓ పోస్ట్ పెట్టాడు. RRR ప్రమోషన్స్ కోసం రాజమౌళి 40 కోట్ల రూపాయలను ఖర్చు చేసిందని అతను చెప్పుకొచ్చాడు.
జనవరి 7న RRR సినిమా విడుదల వాయిదా పడటంతో ఇక ఇప్పటి దాకా చేసిన ప్రమోషన్ కార్యక్రమాలన్నీ వృధా అయినట్టేనని ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి. అంటే ఇప్పటి వరకు RRR ప్రమోషన్స్ కోసం ఖర్చు చేసిన 40 కోట్ల రూపాయలు బూడిదలో పోసిన పన్నీరేనని అంటున్నారు. ఇప్పటికే RRR మూవీ బడ్జెట్ భారీగా పెరిగిందని నిర్మాతలు ఆందోళన చెందుతుంటే, ఇప్పుడు ఇలా ప్రమోషన్స్ ఖర్చు వృధా కావడం ఆవేధన వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.
Breaking news- Film #RRR is postponed for indefinite time. While producers have already spent approx ₹40Cr on promotion till now.
— Umair Sandhu (@UmairSandu) January 1, 2022