ఫిల్మ్ డెస్క్- విలక్షణమైన నటుడు ప్రకాష్ రాజ్ కేవలం సినిమాలే కాదు, సమాజంలో జరిగే అంశాలపైనా దృష్టి పెడతారు. సోషల్ మీడియాలోను ఆయన చాలా యాక్టీవ్ గా ఉంటారు. మొన్న జరిగిన తెలుగు మూవీ ఆర్టిస్ట్ అసోషియేషన్ ఎన్నికల్లో పోటీ చేసిన ప్రకాష్ రాజ్ ఓటమి పాలైన సంగతి తెలిసిందే. అన్నట్లు ప్రకాష్ రాజ్ సమాజ సేవలోను ముందుంటారు. తెలంగాణతో పాటు కర్ణాటకలో ఉర్లను దత్తత తీసుకుని అభివృద్ది చేశారాయన.
ఇదిగో మరోసారి ప్రకాష్ రాజ్ తన గొప్ప మనసును చాటుకున్నారు. ఓ దళిత యువతి జీవితంలో ఆయన వెలుగులు నింపారు. పరీక్షల్లో ప్రతిభ కనబరిచి.. ఆర్థిక పరిస్థితి కారణంగా ఉన్నత చదువులను అభ్యసించలేకపోయిన ఓ యువతికి ప్రకాష్ రాజ్ చేయూతనందించారు. దీంతో ఆమె బ్రిటన్‌లో మాస్టర్స్ చదువుకునేందుకు వెళ్తోంది. సినిమా దర్శకుడైన నవీన్ మహ్మదాలీ సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని తెలిపారు.
ప్రకాష్ రాజ్ సహాయం చేసిన యువతి పేరు శ్రీ చందన. ఆమె ఓ దళిత యువతి. పరీక్షల్లో అద్భుతమైన ప్రతిభ కనబరచడంతో బ్రిటన్‌లో మాస్టర్స్ చదువుకునేందుకు ఆమెకు అవకాశం లభించింది. ఈ క్రమంలో ఆమె తండ్రి చనిపోయాడు. దీంతో ఆర్థిక పరిస్థితులు సహకరించకపోవడంతో శ్రీ చందన చదువుకొలేకపోయింది. ఈ విషయం సోషల్ మీడియా ద్వార ప్రకాష్ రాజ్ దృష్టికి వచ్చింది. వెంటనే స్పందించిన ప్రకాష్ రాజ్ ఆమెను చదివించేందుకు ముందుకు వచ్చారు. శ్రీ చందన చదువుకయ్యే ఖర్చును ఆయన భరించారు.
అంతే కాదు ఆమె చదువు పూర్తయ్యాక, బ్రిటన్ లో ఆమె ఉద్యోగం పొందేందుకు కూడా ప్రకాష్ రాజ్ హెల్ప్ చేశారని డైరెక్టర్ నవీన్ మహ్మదాలి చెప్పారు. అవకాశాలు వచ్చి అందుకోలేకపోయిన వారికీ ప్రకాష్ రాజ్ లాంటివారు చీకటిలో ఆశాకిరణంలా కనిపిస్తారని, శ్రీ చందనకు ఆర్థికంగా మీరు సహాయపడి, ఒక దళిత యువతి బ్రిటన్‌లో మాస్టర్స్ చదువుకునేందుకు అయ్యే ఖర్చును భరించి, ఆమె జీవితంలో వెలుగుని నింపినందుకు థ్యాంక్ యూ.. అంటూ ప్రకాష్ రాజ్ కు ధన్యవాదాలు తెలిపారు నవీన్.
thnx & salutes to this man @prakashraaj . he has financially helped Srichandana, a fatherless poor meritorious dalit girl, secure her admission in UK university, finish her masters and now funded for her to find a job there too. thnx sir for making a difference in one’s life ❤️ pic.twitter.com/tfB41u4Qxy
— Naveen Mohamedali (@NaveenFilmmaker) December 13, 2021