మలయాళంలో సూపర్‌హిట్ అయిన లూసిఫర్ సినిమాను తెలుగులో మెగాస్టార్ చిరంజీవి హీరోగా గాడ్ ఫాదర్ పేరుతో రీమేక్ చేస్తోన్న సంగతి తెలిసిందే. మలయాళంలో సూపర్ హిట్ అయిన ఈ పవర్ ఫుల్ పొలిటికల్ డ్రామాలో హీరోయిన్ నయనతార ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమాలో హీరో చెల్లెలి పాత్ర చాలా కీలకంగా ఉంటుంది. తెలుగు రీమేక్ లో నయన్ ఈ పాత్రలో నటిస్తున్నారు. ఈ క్రమంలో గాడ్ ఫాదర్ సినిమా కోసం నయన్ తీసుకుంటున్న పారితోషికం హాట్ టాపిక్‌గా మారింది.
ఇది కూడా చదవండి: చెట్టును పెళ్లాడబోతున్న నయనతార.. కారణం ఏమిటంటే?
ఈ పాత్ర కోసం నయన్ హీరోయిన్ రేంజ్ పారితోషికం తీసుకుంటున్నట్లు తెలిసింది. ఏకంగా రూ. 4 కోట్లు తీసుకుంటున్నారిన ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాలో నయన్ పాత్ర చాలా పవర్ ఫుల్ గా ఉండనుంది. అందుకే ఆమెకు ఈ రేంజ్లో పారితోషికం ముట్టజెపుతున్నట్లు ఇంటస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.ఈ సినిమాలో నయన్ భర్తగా సత్యదేవ్ నటిస్తున్నట్లు తెలుస్తోంది. కొణొదెల ప్రొడక్షన్స్, సూపర్ గుడ్ ఫిల్మ్స్ జాయింట్‌గా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి.
ఇది కూడా చదవండి : నయనతార ‘నీడ’ చూస్తే భయం..ఖాయం !