సమాజంలో మార్పు రావాలంటే ముందు మన ఆలోచనలో మార్పు రావాలి. నిత్యం సమాజ అభివృద్ధికి పాటు పడే ఆలోచనలు చేయాలి. అలాంటి ఆలోచనలతో ఓ మహిళ తమ గ్రామా అభివృద్ధికి కోసం ముందడుగు వేసింది. ఆమె మొండి ధైర్యంతో గ్రామం కోసం ఒక అడుగు ముందుకేస్తే నాలుగు అడుగులు ఆమె వెనకుండి ప్రోత్సహించాయి. అలా నలుగురు ప్రోత్సహించినప్పుడు ఎంతటి మొండి సమస్యకైన పరిష్కారం దొరుకుతుందంటుంది ప్రియాంక తివారీ. గ్రామ సర్పంచ్ గా ప్రియాంక ఏడాది పాటు ఉండి.. పర్యావరణాన్ని ఎలా కాపాడుకోవచ్చో మాటల్లో కాక చేతల్లో చేసి చూపించి ఎంతో మందికి ఆదర్శంగా నిలించిది. ఇంతకి ఈ ప్రియాంక కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం..
రాజస్థాన్‌లో పుట్టి ఢిల్లీలో పెరిగిన 29 ఏళ్ల ప్రియాంక తివారీ మాస్ కమ్యునికేషన్స్‌లో గ్రాడ్యుయేషన్ చేసింది.2019లో ప్రియాంకకు వ్యాపారవేత్తతో వివాహం జరిగింది. దీంతో కాపురానికి అత్తగారి ఉరైన ఉత్తరప్రదేశ్ లోని రాజ్ పూర్ గ్రామంకి వెళ్లింది. ఢిల్లీలో పెరిగిన ప్రియాంకకు రాజ్ పూర్ గ్రామం పెద్దగా నచ్చలేదు. గ్రామంలో డ్రైనేజి వ్యవస్థను మొదలుకోని ఏ మౌలిక సదుపాయాలు లేవని గుర్తించింది. ఈ క్రమంలో ఈ సమస్యలను ఎలా పరిష్కరించాలా అని ఆలోచిస్తుండేది. ఇదే సమయంలో ఆమెకు మంచి అవకాశం వచ్చింది. రాజ్పూర్ పంచాయితీ ఎన్నికల ప్రకటన వచ్చింది. ప్రియాంక ఆలోచనలు అర్థం చేసుకున్న అత్తమామలు ఎన్నికల్లో ఆమెను పోటీచేయమని చెప్పారు. తన ఆలోచనలను గ్రామస్థులతో పంచుకుంది.
ఇదీ చదవండి: గుక్కెడు నీళ్ల కోసం ప్రాణాలకు తెగిస్తున్న మహిళలు! ఇంత కష్టం ఎక్కడంటే?
ఆమె మాటలకు అక్కడి ప్రజలు ఆకర్షితులై.. ప్రియాంకను గెలిపించారు. పంచాయితీ సర్పంచ్‌గా బాధ్యతలు చేపట్టిన మరుసటి రోజునుంచే ప్లాస్టిక్ నిషేధం అమల్లోకి తెచ్చింది ప్రియాంక. ఇందుకు అందరూ సహకరించాలని గ్రామస్థులను కోరింది. గ్రామంలోని కిరాణా, రోడ్లమీద బడ్డీ దుకాణాలకు పంచాయితీ నుంచి బట్టతో తయారు చేసిన బ్యాగ్‌లను సరఫరా చేసింది. ప్లాస్టిక్ వల్ల మానవాళికి, పర్యావరణానికి కలిగే నష్టం గురించి అవగాహన కార్యక్రమాలు నిర్వహించి గ్రామస్థులు స్వచ్ఛందంగా ప్లాస్టిక్ నిషేధాన్ని పాటించేలా చేసింది. దీంతో గ్రామంలో ప్లాస్టిక్ వినియోగం 75 శాతం పడిపోయింది.
ఇదీ చదవండి: షాకింగ్ వీడియో.. కాంగ్రెస్ మహిళా ఎమ్మెల్యే కాళ్లు మొక్కిన CM!
ప్లాస్టిక్ నిషేధాన్ని ఇంత పకడ్బందీగా అమలు చేస్తోన్న ప్రియాంకని ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రప్రభుత్వం గుర్తించి రూ.9 లక్షల రూపాయలను బహుమతిగా ఇచ్చి సత్కరించింది. ఆ డబ్బులను గ్రామంలో అభివృద్ధికి వినియోగించనుంది. కేవలం ఏడాదిలోనే రాజ్పూర్వైపు అందరూ చూసేలా చేసింది ప్రియాంక. కోడాలిగా తమ గ్రామానికి వచ్చి.. దేవతలా మారిందని అక్కడి గ్రామస్థులు ప్రియాకను పొగుడుతున్నారు. మరి.. ఈ యువ సర్పంచ్ చేస్తున్న గ్రామ అభివృద్ధిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.